Published On: Wed, Aug 23rd, 2017

అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు సొంత స్థలాలు

* కృష్ణా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: కృష్ణా జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మిస్తున్న క్రమంలో, వీటికి సొంత స్థలాలు సమకూరేలా చూడాలని రెవెన్యూ అధికారులను కలెక్టరు బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. నగరంలోని తమ విడిది కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో 3,812 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటిల్లో 1090 కేంద్రాలకు సొంత స్థలాలు లేవన్నారు. వీటికి స్థలాలను సమకూర్చాలని ఆర్డీఓలు, తహసిల్దార్లను ఆదేశించారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి దాతల సహకారం తీసుకోవాలని కోరారు. అన్న అమృత హస్తం, రక్తహీనత నివారణ తదితరాలపై సమీక్షించారు. సమావేశంలో డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, విజయవాడ ఆర్డీఓ ఎస్‌.హరీష్‌, డీపీఓ ఆనందబాబు, ఐసీడీఎస్‌ పీడీ కె.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

collector_23-08-17_1

Just In...