Published On: Fri, Nov 2nd, 2018

అంతర్గత జలరవాణా మార్గాల ఏర్పాటుకు అవసరమైన భూమి

* సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో అంతర్గత జల రవాణా ప్రాజెక్టులకు అవసరమైన భూమి వెంటనే కేటాయించాలని ఉన్నత అధికారులు నిర్ణయించారు. శుక్ర‌వారం సచివాలయంలో ఇన్ లాండ్ వాటర్ వేస్  అథారిటీ ఆఫ్ ఇండియా IWAI  ఇంజనీర్లు, ఉన్నత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా సమీక్ష నిర్వహించారు. ముక్య్తాల, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రపురం వద్ద ఏర్పాటు చేయనున్న మూడు శాశ్విత టెర్మినళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని త్వరలో కేటాయించేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు.ముక్త్యాలలో 8.57 ఎకరాలు, హరిశ్చంద్రపురం వద్ద 4.62 ఎకరాలు, ఇబ్రహీంపట్నం వద్ద 5.5 ఎకరాలు భూ సేకరణ జరిపి IWAI కి అప్పగించేందుకు అధికారులు అంగీకరించారు. రాజధాని అమరావతిలో IWAI ఉద్యోగుల నివాస సముదాయం నిర్మించుకునేందుకు మూడు ఎకరాల భూమి కేటాయించాలని IWAIఅధికారులు కోరారు. దీనిపై మంత్రుల ఉప సంఘం నిర్ణయిం తీసుకుంటుందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని ఏపీటీడీసీ వద్ద ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్, గుంటుపల్లి… తాళ్లాయపాలెం మధ్య నున్న 400 కేవీ విద్యుత్ లైన్లు జలరవాణా మార్గాలకు అడ్డంకిగా మారాయి. వీటిని మార్చే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా అధికారులకు సూచించారు.

Just In...