Published On: Mon, Dec 16th, 2019

అందాల శ్రీమతులు … ఫ్యాషన్ హుందాలు ..!

* ఆద్యంతం అలరించిన  మిస్సెస్ అర్బన్ ఇండియా తుది పోటీల ఫ్యాషన్ షో

సెల్ఐటి న్యూస్‌, మాదాపూర్‌ : అందాల శ్రీమతులు .. ఫ్యాషన్  సోబగులతో  మెరిసి.. మురిసిపోయారు. వెస్ట్రన్, ట్రెడిషనల్ కలెక్షన్స్‌లో వయ్యారాల నడకలతో  హోయలోలికారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన రెండు రోజుల ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా చివరి రోజైన ఆదివారం మిస్సెస్ అర్బన్ ఇండియా గ్రాండ్ ఫినాలే ఆద్యంతం అలరించింది. కార్య‌క్ర‌మంలో 34 మంది పోటీపడ్డ మహిళలు తమ వయ్యారాల నడకలతో మోడళ్లను తలపించే విధంగా అదరహో అనిపించారు . వివిధ రంగాల నుండి మహిళలు ఇందులో పోటీ పడ్డారు. పలు అంశాల ఆధారంగా విజేతలను జ్యూరీ సభ్యులు, డిజైనర్లు కొండా కవితా రెడ్డి, సింధు వార‌గాని, నటి రోహిణి నాయుడు పాల్గొని ఎంపిక చేశారు. వీటితో పాటు ప్రత్యేకంగా కిడ్స్ నేషనల్ ఫ్యాషన్ కాంటెస్ట్ కూడా జరిగింది. ఇందులో 87 మంది బాలబాలికలు పాలుపంచుకున్నారు. బుడి.. బుడి నడకలతో చిన్నారులు సైతం అలరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన ఈ ఫెస్టివల్‌కు మంచి స్పందన లభించిందని, ఈ ఫెస్టివల్ మోడలింగ్ రంగంలో రాణించాలని కొనేవారికి మంచి వేదికగా నిలుస్తుందని అన్నారు.

 

Just In...