Published On: Sun, Dec 2nd, 2018

అందుబాటులోకి క‌న‌క‌దుర్గ‌మ్మ సుప్ర‌భాత సేవ టిక్కెట్లు

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్దానంలో ఇటీవ‌ల నూత‌నంగా ప్ర‌వేశ‌పెట్టిన సుప్ర‌భాత సేవ టిక్కెట్లును ఆదివారం నుండి ఆన్‌లైన్‌తో పాటు మీ-సేవ సెంట‌ర్లు, ఆర్జిత సేవ కౌంట‌ర్ల ద్వారా పొందే విధంగా ఆల‌య అధికారులు భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆరుగురు వేదపండితులచే అమ్మవారి అంత‌రాల‌యం ఎదుట సుప్ర‌భాత సేవ జ‌ర‌గ‌నుంది. ఆయా టిక్కెట్ల‌ను www.kanakadurgamma.org నందు, మీ-సేవ సెంట‌ర్లు, ఆర్జిత సేవ కౌంటర్ల‌లో భక్తులు పొంద‌వ‌చ్చు. సుప్ర‌భాత సేవ టిక్కెట్టు ధ‌ర‌ను అధికారులు రూ.300గా నిర్ణ‌యించారు.

Just In...