Published On: Tue, Jun 12th, 2018

అంద‌రి చిట్టా నాద‌గ్గ‌ర ఉంది..

* ఇక‌పై అలాంటి వారిని ఉపేక్షించను

* పార్టీ నేతలకు చంద్రబాబు ఘాటు హెచ్చరిక

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: తానేమీ పట్టించుకోవటం లేదనుకుని ఏదైనా చేయొచ్చు అనే భావనలో కొందరు నేతలున్నారని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌లువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగ‌ళ‌వారం వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో నిర్వ‌హించిన పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ కొందరు పార్టీ నేతలు ఇప్పటివరకూ సరిగా పని చేయకపోయినా మారుతారులే అన్న భావనతో చర్యలు తీసుకోలేదని అన్నారు. రోజూ ఎవరేం చేస్తున్నారో అన్ని నివేదికలు తన దగ్గర ఉన్నాయని.. ఇకపై తాను తీసుకునే చర్యలకు నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్నందున ఇకపై ఎవరి నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోనని తేల్చిచెప్పారు. ప్రపంచంలో రెండు భిన్న ధృవాలైన అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా అధ్యక్షుడు శాంతి కోసం సింగపూర్‌ని వేదికగా ఎంచుకున్న సంఘటనను సీఎం సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. అలాoటి సింగపూర్ ఆంధ్రప్రదేశ్‌ని పూర్తిగా నమ్మి సహకరిస్తుంటే విపక్షాలు విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని చంద్ర‌బాబు మండిప‌డ్డారు.

Just In...