Published On: Thu, Jan 10th, 2019

అంబులెన్స్‌ల సేవ‌లు అమోఘం

* సేవ్ ఎ లైఫ్‌ అంబులెన్స్ ర్యాలీని ప్రారంభించిన సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ: వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా మనిపాల్ హాస్పటల్ వారు సేవ్ ఎ లైఫ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విజయవాడ పోలీస్ కమీషనర్ దార్వకా తిరుమలరావు బుధ‌వారం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో అంబులెన్స్‌లు ప్రజలకు అమోగమైన సేవలు చేస్తున్నాయ‌న్నారు. ప్రమాదాలు జ‌రిగిన సంద‌ర్భంలోనూ, ప్రమాదంలో గాయపడిన వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సత్వర చికిత్స అందించడంలో అంబులెన్సుల సేవ‌లు అమోఘం అన్నారు. ఈ త‌ర‌హా సేవ‌లందించే సమయంలో ప్రజలు కూడా తమ వంతు భాద్యతను తెలుసుకుని అంబులెన్స్‌కు సాధ్యమైనంత వరకు దారి ఇస్తూ రోగుల ప్రాణాలు కాపాడాల‌ని కోరారు. పోలీసులు కూడా తమవంతు భాద్యతగా రెడ్ సిగ్నెల్ పడినప్పటికి ట్రాఫిక్‌ను క్లీయ‌ర్ చేస్తూ అంబులెన్స్‌లకు దారి ఇస్తూ తమవంతు భాద్యతను నిర్వర్తిస్తున్నార‌ని తెలిపారు. కార్యక్ర‌మంలో విజయవాడ స్పెషల్ బ్రాంచ్ ఏడిసిపి ఎల్.టి.చంద్రశేఖర్, ట్రాఫిక్ ఏడిసిపి నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి ఎస్.రమేష్‌బాబు, సౌత్ జోన్ ఏసిపి రమణమూర్తి, మనిపాల్ హాస్పటల్ సిఇఒ కె.సుధాకర్, మనిపాల్ హాస్పటల్ సూపరిండెంట్ డాక్ట‌ర్ చరణ్, పోలీస్ అధికారులు, మ‌ణిపాల్ హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Just In...