Published On: Fri, Sep 4th, 2020

అక్టోబరు 5కు ‘జగనన్న విద్యా కానుక’వాయిదా

* పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ప్ర‌భుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనుకున్న‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్నిసెప్టెంబరు 5న ప్రభుత్వం నిర్వహించాలనుకున్న విషయం విదితమే. అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ – 19 అన్‌లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 30వ‌ర‌కూ పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించడంతో ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5వ తేది నాటికి వాయిదా వేస్తున్నట్లు తాత్కాలికంగా నిర్ణయించడమైనదని పేర్కొన్నారు. ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమం అక్టోబరు 5న ఏర్పాటవుతుంద‌ని.. ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు గమనించాలని కోరారు.

Just In...