Published On: Sat, Nov 3rd, 2018

అక్టోబ‌రులో రికార్డు స్థాయిలో స‌రుకు ర‌వాణ‌

* వేగ‌న్ల లోడింగ్ సంఖ్య‌లో గ‌ణ‌నీయ‌మైన అభివృద్ధి

* ల‌క్ష్యాన్ని మించి 0.905 టన్నుల వృద్ధిని నమోదు చేసిన ద‌.మ. రైల్వే

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్ మాసంలో రికార్డు స్థాయిలో 9.952 మిలియన్ టన్నుల (ఎమ్టి) సరుకు రవాణా చేసి గత సంవ‌త్స‌రం అక్టోబ‌రు మాసంలో నమోదైన సరుకు రవాణా (7.565 ఎమ్టిలు) కంటే 2.387 మిలియన్ టన్నుల ఎక్కువ అభివృద్ధిని సాధించింది. ఈ రికార్డు స్థాయి పెరుగుదల రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యం కంటే 0.905 టన్నుల వృద్ధిని నమోదు చేసింది. దక్షిణ మధ్య రైల్వేలో రోజువారీ సరుకు రవాణా వేగన్ల లక్ష్యం 4485 కాగా, అక్టోబర్ 2018 మాసంలో ఈ లక్ష్యానికి మించి సరుకు రవాణా చేయబడిన సగటు వేగన్ల సంఖ్య రోజుకి 4945. అనగా10% వృద్ధితో రోజుకి 460 వేగన్లు అధికం. ఇది భాతీయ రైల్వేలోనే అత్యధిక రికార్డుగా నమోదైంది. గత సంవత్సరం అక్టోబర్ 2017 మాసంలో జరిపిన సరుకు రవాణాతో పోలిస్తే ఈ అక్టోబర్ 2018 మాసంలో జరిపిన సరుకు రవాణా విభాగంలో బొగ్గు రవాణా 37 శాతం అత్యధిక అభివృద్ధి కనిపించింది. దిగుమతి అయిన ఇనుప ఖనిజం రవాణాలో 190 శాతం, సిమెంట్ రవాణాలో 16 శాతం, ఆహార ధాన్యాల రవాణాలో 18 శాతం, ఎరువుల రవాణాలో 6.7 శాతం, కంటెయినర్ లోడింగ్‌లో 34 శాతం అభిద్ధిని దక్షిణ మధ్య రైల్వే జోన్ నమోదు చేసింది. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి చేసిన సరుకు రవాణా 55.860 మిలియన్ టన్నులతో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు 12.383 మిలియన్ టన్నులు అధికంగా మొత్తం 68.243 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించింది. పనితీరులో ఈ అభివృద్ధి రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 5.826 మిలియన్ టన్నులు అధికంగా నమోదయింది. ఈ సంద‌ర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ రికార్డు స్థాయిలో సరుకు రవాణా విభాగంలో ఈ విజయాలు సాధించడానికి కృషిచేసిన అధికారి ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్.మధుసూదనరావు, మరియు ఆయన బృందాన్ని, కమర్షియల్ మెకానికల్, ఇంజనీరింగ్, సిగల్ & టెలి కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులను, సిబ్బందిని ప్రశంసించారు.
 

Just In...