Published On: Mon, Aug 3rd, 2020

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న మ‌ద్యం స్వాధీనం

* ముగ్గురు నిందితులు అరెస్టు, రెండు వాహ‌నాలు సీజ్

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: అక్ర‌మంగా భారీగా త‌ర‌లిస్తున్నమ‌ద్యంను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు.
ఈ సంద‌ర్భంగా మ‌ద్యం తరలిస్తున్న ముగ్గురు నిందితులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1289 మద్యం బాటిల్స్ మరియు 1 మోటారు సైకిల్, 1 ఆటో స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమీషనర్ వినిత్ బ్రిజ్లాల్ ఆదేశాల మేరకు అక్రమ మద్యం మరియు ఇసుక
అక్రమ రవాణా నియంత్రణకు విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం విజయవాడ నగరంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్పెషల్ ఆఫీసర్ ఎం.సత్తిబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేసి అక్రమంగా మద్యం
తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1209 మద్యం బాటిల్స్ మరియు 1 మోటారు సైకిల్, 1 ఆటో స్వాధీనం చేసుకోవడం జరిగింది. తనిఖీలలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ హనీష్, ఎస్.ఐలు జి.శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, గురుప్రకాష్, భరత్, రవి, సిబ్బంది పాల్గొన్నారు.

 

Just In...