Published On: Wed, Jun 13th, 2018

అగ్రిగోల్డ్ చైర్మన్ సహా ఆరుగురు డైరెక్టర్లకు బెయిల్ మంజూరు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి క్రైం: అగ్రిగోల్డ్ చైర్మన్‌ సహా ఆరుగురు డైరెక్టర్లకు బెయిల్  మంజూరైంది. గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయడంలో సీఐడీ విఫలమైంది. చిట్‌ఫండ్ యాక్ట్ ప్రకారం 60రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలి. అలా జరగకపోవడంతో నిందితులు అవ్వా వెంకటరామారావు, అవ్వా ఉదయ్ భాస్కర్, అవ్వా మణిశర్మ, అవ్వా శేషు నారాయణరావు, ప్రసాద్, సాయిరాంల‌కు మచిలీపట్నం కోర్టు మంగ‌ళ‌వారం బెయిల్ మంజూరు చేసింది. కాగా నిందితులు ప్రస్తుతం ఏలూరులో కోర్టులో ఉన్నారు. వీరిపై ఏపీ, తెలంగాణలో మొత్తం 16 కేసులు ఉన్నాయి. కడప, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్ ఎల్బీనగర్, మహబూబ్‌నగర్, నల్గొండలో కేసులు నమోద‌య్యాయి. ఇప్పటికే వీరికి అన్ని జిల్లా కోర్టుల్లో బెయిల్ మంజూరైంది. మచిలీపట్నం చివరిది కావడంతో మంగళవారం వీరికి బెయిల్ మంజూరైంది. అయితే కర్ణాటకలో అవ్వా వెంకటరామారావు, అవ్వా శేషు నారాయణరావుపై కేసు పెండింగ్‌లో ఉంది. ఈ ఇద్దరు కాకుండా మిగిలిన నిందితులంతా విడుదలయ్యే అవకాశం ఉంటుందని సమాచారం.

Just In...