Published On: Sun, Nov 4th, 2018

అచ్చేదిన్ కొందరికే…

* సిపిఐ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు  కన్హయ్య కుమార్

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: దేశంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదని సిపిఐ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు కన్హయ్య కుమార్ అన్నారు. విజయవాడలో ఓ హోట‌ల్‌లో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్ఠు పట్టించడం ద్వారా మోదీ ప్రభుత్వం ప్రజలపై నేరుగా దాడికి దిగుతోందన్నారు. కొంతమంది కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఏడు దశాబ్దాలుగా ఎన్నడూ లేని నియంత పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మతపరమైన అంశాలలో జోక్యం చేసుకోవడం ద్వారా పాలక బిజెపి నేతలు రాజకీయాలకు మతం రంగు పులిమేందుకు చేస్తున్న ప్రయత్నాలను వామపక్షాలు అడ్డుకుంటాయన్నారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామకృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...