Published On: Sat, Jun 27th, 2020

అజయ్ కల్లాం రాజకీయ దుష్పచారం చేయటమేంటి?

* తెదేపా రాష్ట్ర అధ్య‌క్షుడు కళా వెంకట్రావ్

గుంటూరు, సెల్ఐటి న్యూస్‌: 2014లో చంద్రబాబు నాయుడు అధికారం లోకి వచ్చేనాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉన్నది. నాడు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 9,529 మెగావాట్లు మాత్రమే. కానీ, చంద్రబాబు నాయుడు రూ. 39 వేల కోట్లు రూపాయలు విద్యుత్ రంగంలో పెట్టుబడులుప పెట్టి 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి లోటును తీర్చ లేదా?. రోజుకు 12 గంటల కరెంటు కోతను నివారించలేదా? రాయలసీమలో సౌర, పవన విద్యుత్ రంగంలో రూ.36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 13 వేల మందికి ఉద్యోగాలు కల్పించలేదా?. ఇప్పుడు దానిని అనుభవిస్తూ ఏడాది పాలన చేసిన తర్వాత కూడా బకాయిలు పెట్టిపోయారని మాట్లాడటానికి మీ చేతగాని తనానికి నిదర్శనం. గత ప్రభుత్వ రూ. 32 వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు, రూ.16 వేల కోట్ల అప్పులు పెట్టిపోతే దానిని తెలుగుదేశం ప్రభుత్వ కట్టలేదా? గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. కానీ మీరు వచ్చిన ఏడాది కాలంలోనే రెండుసార్లు విద్యుత్ స్లాబులు మార్చి చార్జీలు మూడు రెట్లు పెంచారు. సౌర విద్యుత్ సంస్థలు రూ.4.80 లకే విద్యుత్ ఇవ్వడానికి ముందుకొస్తే ప్రక్క రాష్ట్రాల నుండి రూ.11కు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజాధనాన్ని వృధా చేస్తూ టీడీపీ పై విమర్శలా? రూ.4.80  వచ్చే విద్యుత్ ను కాదని రూ.11కు కొనడం ఆదా చేయడమా? ఒప్పందాలు ఉల్లంఘించలేదని చెప్పటం దుర్మార్గం. హైకోర్టు తీర్పులు అమలు చేయకుంగా పీపీఏ లను ఉల్లంఘించింది మీరు కాదా? మీ అవినీతి కోసం రూ.11 పెట్టి విద్యుత్ కొని దానిని కప్పెట్టుకోవటం కోసం విద్యుత్ సంస్థను అభివృద్ధి చేసి డజన్ల కొద్ది కేంద్ర అవార్డులు పొందిన చంద్రబాబు నాయుడిపై ఉద్యోగస్తుడిగా ఉండే అజయ్ కల్లాం రెడ్డి రాజకీయ విమర్శలు చేయటం అధికార దుర్వినియోగం అవుతుంది.

Just In...