అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన అల్తాఫ్ బాబా
కొండపల్లి(కృష్ణాజిల్లా), సెల్ఐటి న్యూస్: రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గాలో 809 ఉరుసు మహోత్సవం జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని హజరత్ సయ్యద్ షాబుఖారి దర్గాహ్ తరపున దర్గా ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ మహమ్మద్ అల్తాఫ్ బాబా చాదర్ సమర్పించారు. ప్రతి ఏటా ఆనవాయితీగా చాదర్ కొండపల్లి నుండి పంపించడం, అదేవిధంగా అక్కడి నుండి చాదర్ ఇక్కడకు తీసికురావడం జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడి స్థానిక మీడియాతో అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హజ్రత్ సయ్యద్ షా బుఖారి ఆస్థానం నుండి ఇక్కడికి చాదర్ తీసుకొచ్చామని, ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సారధ్యంలో హజ్రత్ సయ్యద్ షాఋఖారి దర్గా ఉరుసు మహోత్సవాలు విజయవంతం కావాలని ఆయన మరింత ఉన్నత పదవులు చేపట్టాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అజ్మీర్ షరీఫ్ దర్గా పీఠాధిపతి సయ్యద్ సుల్తాన్, మూజవర్లు, దర్గా ప్రతినిధులు, సయ్యద్ నజీరుద్ధీన్ బాబా తదితరులు పాల్గొన్నారు.