Published On: Mon, Apr 6th, 2020

అట్ట‌డుగు వ‌ర్గాల అభ్యున్న‌తికి బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ కృషి…

* తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన డాక్ట‌ర్ బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ జీవితం ఆద‌ర్శ‌ప్రాయ‌మ‌ని నేటి యువ‌త ఆయ‌న బాట‌లో ముందుకు సాగాల‌ని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. డాక్ట‌ర్ బాబూ జగ్జీవన్‌రామ్ 113వ జయంతి సందర్భంగా ఆదివారం ఉద‌యం ఆయన శిఖామ‌ణి సెంట‌ర్‌లోని బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ కాంస్య విగ్ర‌హానికి పూల‌మాల వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ సంక్షోభాలా పరిష్కరానికి దార్శనికత‌తో దారి చూపిన గొప్ప నేత, మానవ నిర్మిత కుల వివక్ష పూరిత సమాజానికి వ్యతిరేకంగా నవ సమాజ నిర్మాణానికి కృషి చేసిన సమతవాది బాబూ జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్‌రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిద‌ని గుర్తుచేశారు. కార్య‌క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

 

Just In...