Published On: Mon, Sep 11th, 2017

అడ్డుపడేవారిని అడ్రస్‌ లేకుండా చేయండి

* ఇంటింటికి తెలుగుదేశం కార్య‌క్ర‌మం ప్రారంభంలో సీఎం చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌, శ్రీకాకుళం: ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో రాజకీయాలకు చోటులేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందేనని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తెట్టంగిలో సోమ‌వారం ఆయ‌న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను చంద్రబాబు స్వ‌యంగా అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలుతీరుపై వాకబు చేశారు. అనంత‌రం సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ తెట్టంగి అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నారు. తెలుగు జాతి కోసం రాత్రింబవళ్లు కష్టపడతాన‌ని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. రైతులకు రుణవిముక్తి కల్పించామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కొంతమంది అడ్డుపడుతున్నారని అలాంటి వారిని అడ్రస్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదన్నదే తమ అభిమతమని సీఎం చంద్ర‌బాబు స్పష్టం చేశారు.

srikakulam_14_11-09-17 srikakulam_5_11-09-17 srikakulam_3_11-09-17 srikakulam_2_11-09-17 srikakulam_10_11-09-17 srikakulam_9_11-09-17 srikakulam_8_11-09-17 srikakulam_11_11-09-17 srikakulam_1_11-09-17 srikakulam_13_11-09-17 srikakulam_12_11-09-17 srikakulam_6_11-09-17 srikakulam_7_11-09-17 srikakulam_4_11-09-17

Just In...