Published On: Thu, Jan 10th, 2019

అతిధ్య రంగంలో పెట్టుబ‌డుల‌కు అపార అవ‌కాశాలు

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క ప్రాధికార సంస్ధ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి హిమాన్హు శుక్లా

* మార్కెటింగ్ వ్యూహాల‌పై ఇక ప‌ర్యాట‌క శాఖ దృష్టి

* ప్ర‌భుత్వ‌, ప్ర‌వేటు రంగ భాగ‌ప్వామ్యామే ఇక కీల‌కం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: రాష్ట్ర అతిధ్య‌రంగంలో పెట్టుబ‌డుల పెట్టుబ‌డుల‌కు విస్తృత అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వ‌హ‌ణ అధికారి హిమాన్హు శుక్లా తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క ప్రాధికార సంస్ధ విజ‌య‌వాడ వేదిక‌గా గురువారం అతిధ్య‌రంగంలో ఉన్న అవ‌కాశాల‌పై రాష్ట్ర స్దాయి స‌ద‌స్సు నిర్వ‌హించింది. విజ‌య‌వాడ‌లోని హ‌రిత బెరం పార్కు వేదిక‌గా స‌ద‌స్సు జ‌ర‌గ‌గా, రెండు సెష‌న్స్‌గా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శుక్లా మాట్లాడుతూ ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఉన్న వ‌న‌రులు మ‌రే రాష్ట్రంలోనూ లేవ‌ని, వాటిని స‌ద్వినియోగం చేసుకోవ‌టం ద్వారా ప‌ర్యాట‌క రంగాన్ని ప‌రుగులు పెట్టించ‌వ‌చ్చ‌ని అన్నారు. రానున్న కాలంలో భ‌విష్య‌త్తు ప్రైవేటు పెట్టుబ‌డిదారుల‌దేన‌ని, ఆ క్ర‌మంలోనే ప‌ర్య‌ట‌క శాఖ కేవ‌లం మార్కెటింగ్‌పై దృష్టి పెడుతుంద‌ని వివ‌రించారు. ప‌ర్యాట‌క శాఖ ప‌రంగా ఔత్సాహిక పెట్టుబ‌డి దారుల‌కు త‌మ వంతు స‌హకారం అందిస్తామ‌ని, అవ‌స‌ర‌మైన భూమిని నిబంధ‌న‌ల మేర‌కు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని తెలిపారు. ప‌ర్యాట‌క శాఖ ప‌రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అతిధ్య రంగం అభివృద్దికి అందిస్తున్న ప్రోత్సాహకాల  గురించి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అవ‌గాహ‌న క‌లిగించుకోవాల‌న్నారు. ప‌ర్యాట‌కుల పాద‌ముద్ర‌ల ప‌రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్ప‌టికే జాతీయ స్దాయిలో మూడో స్ధానాన్ని అందిపుచ్చుకోగా, కీల‌క స‌మయాల‌లో అతిధి గృహాల కొర‌త నెల‌కొంటుంద‌ని దీనిని అధిక‌మించే క్ర‌మంలో ఈ స‌ద‌స్సు ఏర్పాటు చేశామ‌ని శుక్లా పేర్కొన్నారు.
ఇప్ప‌టికే అతిధ్య రంగంలో ఉన్న అనుభ‌వ‌జ్ఞుల‌తో పాటు,  ఈ రంగంప‌ట్ల ఆస‌క్తి ఉన్న ఔత్సాహికుల‌కు సైతం ఉప‌క‌రించేలా ఈ స‌ద‌స్సు కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించారు.  తొలి సెష‌న్‌లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా అతిధ్య రంగంలో పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క ప్రాధికార సంస్ధ అందిస్తున్న సేవ‌ల గురించి శుక్లా వివ‌రించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అతిధ్య రంగంలో ఉన్న పెట్టుబ‌డి అవ‌కాశాలపై పూర్తి అవ‌గాహ‌న క‌లిగించేలా కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌గా, వివిధ రాష్ట్రాల‌తో పాటు డిల్లీ నుండి సైతం హోట‌ల్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన నిపుణులు వ‌చ్చారు. దాదాపు 50 మంది త‌మ ఆలోచ‌న‌ల‌ను అధికారుల‌తో పంచుకుని, సందేహాల‌కు నివృత్తి పొందారు. ఆంధ్రప్ర‌ధేశ్ ప‌ర్యాట‌క ప్రాధికార సంస్ధ తొలిసారి ఈ తర‌హా కార్య‌క్ర‌మాన్ని ఎంచుకోగా,  ప‌ర్యాట‌క శాఖ‌కు చెందిన వివిధ స్ధాయిల అధికారులు స‌ద‌స్సులో అందుబాటులో ఉండి వ్య‌క్తిగతంగా కూడా పెట్టుబ‌డిదారులతో ముఖాముఖి స‌మావేశం అయ్యారు. రెండో సెష‌న్‌లో స‌ద‌స్సుకు జ్ఞాన భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న వి రిసార్ట్స్ అతిధ్య రంగంలో అందుబాటులో ఉన్న ఉత్త‌మ ప‌ద్ద‌తుల‌పై ఈ రంగ నిపుణులు, ఔత్సాహికుల‌కు వివ‌రించింది.
 

Just In...