Published On: Wed, Dec 4th, 2019

అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

* విజయవాడ పోక్సో స్పెష‌ల్ కోర్టు సంచలన తీర్పు

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ విజ‌య‌వాడ పోక్సో స్పెష‌ల్ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. 2017 డిసెంబర్‌లో అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకునేందుకు ఉయ్యూరు నుంచి తల్లితో కలసి బాధిత బాలిక ఇబ్రహీంపట్నానికి వచ్చింది. అయితే బాలిక బంధువైన సైకం కృష్ణారావు ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో బాలిక తల్లి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు.. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో సోమ‌వారం నిందితుడు కృష్ణారావుకు 20 సంవత్సరాల కఠినకారాగా శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న తరుణంలో పోక్సో యాక్ట్‌ స్పెషల్‌ కోర్టు వెలువరించిన తీర్పుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Just In...