Published On: Thu, Oct 15th, 2020

అద్దె బ‌కాయిలను త‌క్ష‌ణం చెల్లించాలి

* ప‌లు దుకాణాలు సీజ్ చేసిన న‌గ‌ర‌పాల‌క సంస్థ అధికారులు

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌: నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాలలోని షాపుల లీజుదారులు దీర్ఘకాలికoగా ఉన్న అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలని, లేనిప‌క్షంలో బకాయిదారుల షాపులను సిజ్ చేయడంతో పాటు చట్టప‌ర‌మైన చర్యలు తీసుకుంటామ‌ని ఎస్టేట్ ఆఫీసర్ డా.ఎ.శ్రీధర్ హెచ్చరించారు. నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ఎస్టేట్ అధికారులు వాణిజ్య సముదాయాల‌పై గురువారం ఉద‌యం ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నిర్వహించి రూ.5,25,000 బకాయిలు రెవిన్యూ సిబ్బంది వసూలు చేశారు. వన్‌టౌన్ చిట్టినగర్ వీరాంజనీయ మార్కెట్ నందలి దీర్ఘకాలికoగా అద్దెలు చెల్లించని షాపుల లీజుదారుల నుండి రూ ల‌క్ష వసూలు చేయుటతో పాటుగా బకాయిలు చెల్లించని షాపులను అధికారులు సిజ్ చేశారు.
గవర్నరుపేట డా.ఎన్.టి.ఆర్ వాణిజ్య సముదాయం నందు స్పెషల్ డ్రైవ్ చేపట్టి అద్దె బకాయిదారుల నుండి రూ.4,25,000 వసూలు చేయడంతో పాటు దీర్ఘకాలికoగా అద్దె బకాయిలు కలిగియుండి ఎటువంటి చెల్లింపులు చెల్లించని షాపులను అధికారులు సిజ్ చేశారు. ఈ సందర్భంలో నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాలలోని షాపుల లీజుదారులు ఎటువంటి బకాయిలు లేకుండా ప్రతి నెల అద్దెలు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని,  అట్లు చెల్లించని వారిపై నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు తిసుకోనబడునని హెచ్చరించారు. డ్రైవ్‌లో రెవిన్యూ ఆఫీసర్ రాజకుమార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Just In...