Published On: Wed, Feb 10th, 2021

అనంతలో ఓ ఎస్‌ఐ దుర్మార్గం…

* అన్నంలో పేడ, మట్టి వేసి ఎస్ఐ అన్వర్ బాషా విక్ర‌త చ‌ర్య‌

అనంత‌పురం క్రైం, సెల్ఐటి న్యూస్‌: అనంతపురం జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ప్రజలను రక్షించే బాధ్యతలో ఉన్న ఓ ఎస్ఐ అన్నంలో పేడ, మట్టి కలిపాడు. అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప మండలం గంగవరం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న దళితులు ప్రచారం మధ్యలో భోజనం కోసం వంట చేస్తుండగా బెలుగుప్ప ఎస్ఐ అన్వర్ బాషా అక్కడి వచ్చారు. అనుమతి లేకుండా ఇక్కడ ఎలా వంట చేస్తున్నారంటూ దళితులపై మండిపడ్డారు. ఎవరి అనుమతిలో వంట చేశారంటూ పరుష పదజాలంతో దూషించారు. అంతటి ఆగకుండా తనలోని క్రూరత్వాన్ని బయటపెడుతూ తినడానికి సిద్ధంగా ఉన్న అన్నం, కూరలో పేడ, మట్టి వేశాడు. ఎస్ఐ చర్యతో అక్కడున్నవారు షాకయ్యారు. విషయం తెలుసుకున్న సీఐ అక్కడికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

Just In...