Published On: Tue, Nov 13th, 2018

అనిశాకు చిక్కిన కర్నూలు హౌసింగ్‌ ఏఈ

* భారీగా అక్ర‌మాస్తులు బ‌ట్ట‌బ‌య‌లు

సెల్ఐటి న్యూస్‌, క్రైం డెస్క్‌: కర్నూలు హౌసింగ్ ఏఈ రంగనాథ్‌స్వామి నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగ‌ల‌వారం ఉద‌యం నుంచి సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 4 చోట్ల సోదాలు చేపట్టినట్లు చెప్పారు. కర్నూలు నగరంలో రెండు చోట్ల, బేతంచర్ల, హైదారబాద్ ప్రాంతాల్లో ఉంటున్న ఆయన కుటుంబసభ్యుల ఇళ్లల్లో ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. మ‌ధ్యాహ్నం స‌మ‌యానికే కోటి రూపాయలకుపైగా ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు.

Just In...