Published On: Wed, Oct 16th, 2019

అను ఇనిస్టిట్యూట్ నేతృత్వంలో న్యూరో అండ్ కార్డియాక్ హెల్త్ షో

* వార్షికోత్సవం సందర్భంగా ఉచిత కన్సల్టేషన్,

* సిటి స్కాన్, ఎంఆర్ఎ పరీక్షలపై 50 శాతం రాయితీ

* ‘బీ ఏ సేవియర్’ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ల ప్రదానం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: న‌గ‌రంలోని అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ ప్రధమ వార్షికోత్సవం, అను హాస్పిటల్స్ 7వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 18న న్యూరో అండ్ కార్డియాక్ హెల్త్ షో నిర్వహిస్తున్నామని అను హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ జి.రమేష్ తెలిపారు. సూర్యారావుపేటలోని అను హాస్పిటల్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎనికేపాడులోని అను ఇనిస్టిట్యూట్ నందు నిర్వహించే ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిధులుగా హాజరవుతారని చెప్పారు. హెల్త్ షోలో భాగంగా న్యూరో, కార్డియాక్ విభాగాలకు సంబంధించిన వ్యాధులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. అను ఇనిస్టిట్యూట్ వార్షికోత్సవ సందర్భంగా మూడు రోజుల పాటు అందరికి ఉచిత కన్సల్టేషన్ అందిస్తున్నామని, సిటి, ఎంఆర్ఎ స్కాన్లపై 50 శాతం రాయితీ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ ప్యాకేజి రూ.999, హార్ట్ స్ట్రోక్ ప్యాకేజి రూ.499ల‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అను ఇనిస్టిట్యూట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బీ ఏ సేవియర్’ కార్యక్రమం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో అందించాల్సిన ప్రథమ చికిత్స విధానాలపై 200 మంది అభ్యర్థులకు శిక్షణనిచ్చామని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 18న నిర్వహించే వార్షికోత్సవం కార్యక్రమంలో సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని తెలిపారు. అను ఇనిస్టిట్యూట్‌లోని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక చికిత్సల ద్వారా వేలాది మందికి స్వస్థత చేకూర్చామని, అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక వైద్యం అందించాలనే సంకల్పంతో తాము ముందుకు సాగుతున్నామని డాక్టర్ జి.రమేష్ అన్నారు. అను హాస్పిటల్స్ ద్వారా పలు అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న హెల్త్ షోలో న‌గ‌ర‌వాసులు పాల్గొని, ఉచిత కన్సల్టేషన్, నిర్ధారణ పరీక్షలపై అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డాక్టర్ నవీన్ తోట, డాక్టర్ వి. బాలబాలాజీ, డాక్టర్ ఎన్‌.అనిల్‌కుమార్, డాక్టర్ జి.శ్రీదేవి, డాక్టర్ కె.కిరణ్‌కుమార్, డాక్టర్ కె.దుర్గా నాగరాజు, డాక్టర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Just In...