Published On: Mon, Dec 2nd, 2019

అను హాస్పిటల్స్‌లో ఉచిత వైద్య శిబిరం…

* న‌గ‌ర‌వాసులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరిన ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ దుర్గానాగరాజు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: వరల్డ్ డిజెబిలిటీ డే సందర్భంగా అను హాస్పిటల్స్ నందు ఈ నెల 3న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ సంద‌ర్భంగా సూర్యారావుపేటలోని అను హాస్పిటల్స్ నందు శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గానాగరాజు మాట్లాడుతూ వరల్డ్ డిజెబిలిటీ డే సందర్భంగా నిర్వహించనున్న వైద్యశిబిరంలో అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని చెప్పారు. పుట్టుకతో అంగవైకల్యం, కాలు, చేయి వంకర, సెలిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న, నడవలేని పిల్లలకు ఈ ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా ఉచితంగా చికిత్స చేస్తామని తెలిపారు. అను హాస్పిటల్స్ నందు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సల ద్వారా అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్ర చికిత్సలు నిర్వహించి వారు సంతోషంగా జీవించేలా చేయవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా అను హాస్పిటల్స్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. వరల్డ్ డిజెబిలిటీ డే సందర్భంగా 3వ తేదీన నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని న‌గ‌ర‌వాసులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ దుర్గానాగరాజు కోరారు. విలేకరుల సమావేశంలో అను హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జి.రమేష్, ఎనస్థీషియన్ డాక్టర్ రమ్య తదితరులు పాల్గొన్నారు.

Just In...