Published On: Thu, Feb 25th, 2021

అనూష కుటుంబానికి రూ.10ల‌క్ష‌లు ఆర్థిక స‌హాయం

* నిందితుడికి క‌ఠిన శిక్ష ప‌డేలా చూడాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: గుంటూరు జిల్లా నర్సారావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యకు గురైన ఘటనపై సీఎం వైయస్ జగన్‌ ఆరా తీశారు. ఈ ఘ‌ట‌న‌పై బుధ‌వారం సీఎంఓ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం జ‌గ‌న్ ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో తీవ్ర చర్యలు తీసుకోవాలని, ‘దిశ’ చట్టం కింద వెంటనే దర్యాప్తు పూర్తిచేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని అధికారుల‌ను ఆదేశించారు. దోషిత్వాన్ని నిరూపించి కఠినశిక్ష పడేలా చూడాలన్నారు. అనూష కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, ఆ కుటుంబానికి భరోసానివ్వాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.

Just In...