Published On: Sun, Dec 2nd, 2018

అన్న క్యాంటిన్ ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌అమ‌రావ‌తి: అమ‌రావ‌తిలోని ఉండ‌వ‌ల్లిలో సీఎం నివాసం వ‌ద్ద ప్ర‌జాద‌ర్బార్ హాల్ స‌మీపంలో నూతనంగా నిర్మించిన ‘అన్న క్యాంటీన్’ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ‌నివారం ఉద‌యం లాంఛ‌నంగా ప్రారంభించారు. కలెక్టర్ల సదస్సు అనంతరం అన్న క్యాంటీన్ భవనాన్ని సీఎం ఈ సంద‌ర్భంగా అన్న క్యాంటీన్‌లో మంత్రులు, అధికారులతో కలసి సీఎం అల్పాహారం తీసుకున్నారు. రాష్ట్రంలో 368 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించగా వాటిని 370కి పెంచుతూ కలెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 216, గ్రామీణ ప్రాంతాల్లో 152 నిర్మించాలని మంత్రివర్గంలో తీర్మానం ఇప్పటివరకూ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన పట్టణాల్లో 160, గ్రామీణ ప్రాంతాల్లో 53 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. ప్రారంభమైనప్పటి నుంచీ అన్న క్యాంటీన్లులో భోజనాలు చేసిన వారి సంఖ్య 1,29,74,958, అన్న క్యాంటీన్లకు ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ రూ.25,05,10,095 ఉంది.
 

Just In...