Published On: Tue, Sep 12th, 2017

అభివృద్ధికి ప్ర‌జ‌లు జేజేలు..

* ఇంటింటికి తెదేపా కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న‌

* మంత్రి దేవినేని ఉమ‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: గ‌డ‌చిన మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని, దీనికి పార్టీ శ్రేణులు, ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తుందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. సోమవారం స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో devineni_uma_7ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం విభజన తర్వాత ఆర్థిక లోటులో ఉన్నా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వచ్చే జన్మభూమిలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చేయాల్సిన పనులు, చేపట్టిన పనులను పూర్తి చేయడానికి, ఇళ్లు లేనివారికి ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టిందన్నారు. త‌న నియోజకవర్గం మైలవరం పరిధిలోని గొల్లపూడిలో ఆరు కిలోమీటర్ల మేర ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టానని, దీనికి స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి జయప్రదం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో సుపరిపాలన అందించడంతో పాటు 24 గంటలు కరెంటు, అమరావతి రాజధాని నగర నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారనారు. ప్రజలు ప్రకృతితో మమేకమయ్యేలాగా జలసిరికి హారతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున‌ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పోలవరం ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీల ప్రోత్సాహంతో 2018కి గ్రావిటీతో నీళ్లు అందించి 2019 నాటికి ప్రాజెళ్ళను పూర్తి చేస్తామన్నారు. గోదావరి నీళ్లు 748 టి.ఎంసీలు సముద్రంలో కలవగా, 137 టి.ఎంసీలు త్రాగునీరు, వ్యవసాయానికి ఉపయోగించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతిపక్షాలు నోటికి వచ్చిన‌ట్లు మాట్లాడుతూ బాధ్యత లేకుండా వ్యవహిరించడం ప్రజాస్వామ్యంలో సరైంది కాద‌న్నారు. రాష్ట్రంలో ఇష్టటివరకు 454 మిల్లీమీటర్ల వర్షం పడాల్లి ఉండగా,474 మిల్లీమీటర్ల అధిక వర్షం పడి 44 శాతం ఎక్కువగా నమోదైందన్నారు. ప్రకాశం,నెలూరు, చిత్తూరు జిల్లాల్లో అధికంగా మిగతా 10 జిల్లాలలో సాధారణ వర్షపాతం పడిందన్నారు.

Just In...