Published On: Tue, Jul 21st, 2020

అమూల్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ)

* రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మైలురాయి
* ఒప్పందంపై సంతకాలు చేసిన స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌ హెడ్‌ రాజన్‌
* మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఇదో గొప్ప అడుగు అవుతుంద‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌
అమరావతి బ్యూరో, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌ పాడి పారిశ్రామిక రంగంలో మైలు రాయి. ముఖ్యమంత్రి సమక్షంలో అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. సమగ్ర ఆర్థికాభివృద్ధి మార్గంలో కీలక అడుగులు. ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేసిన అమూల్, ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌. పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు రైతులకు మంచి ధరలు, వినియోగదారులకు సరసమైన ధరలతో అందుబాటులో పాల ఉత్పత్తులు లక్ష్యం. పాడి పరిశ్రమలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌ అవకాశాలు, టెక్నాలజీకి శ్రీకారం. పాడి పశువుల పెంపకం, డెయిరీల నిర్వహణలో పరిజ్ఞానం, సహకార సంఘాల అంశాల్లో మహిళలకు అపార అవకాశాలు. తద్వారా మహిళా సాధికారిత, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడం లక్ష్యం. ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి  శ్రీవైయస్‌.జగన్‌ హామీ ఇచ్చిన ప్రకారం ప్రభుత్వ ఆధీనంలోని సహకార డెయిరీల పునరుద్ధరణ, అభివృద్ధి, వాటికి పాలు పోసే రైతులకు ఇన్సెంటివ్‌లు ఇచ్చే దిశగా అడుగులు. ఆనంద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆర్‌.ఎస్‌.సోధి, మేనేజింగ్‌ డైరెక్టర్, గుజరాత్‌ కో–ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్, అమూల్‌. సంబల్‌ భాయ్‌ పటేల్, ఛైర్మన్, సబర్‌కాంత డిస్ట్రిక్‌ కో–ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్, యూనియన్‌ లిమిటెడ్‌ వారితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం జ‌గ‌న్ ఏపీకి, అమూల్‌కు ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక అడుగు అన్నారు. మ‌హిళల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. పాల ఉత్పత్తిలో దేశంలోనే 4వ స్థానంలో ఉన్నాం. కాని కేవలం 24 శాతం పాలు మాత్రమే వ్యవస్థీకృత రంగానికి వెళ్తున్నాయి. పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి కష్టానికి తగ్గ ధరలు లభించడం లేదు. లీటరు పాలు, లీటరు మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ధర ఒకేలా ఉందంటూ పాదయాత్రలో నాకు రైతులు చూపించారు. లీటరు మినరల్‌ వాటర్‌ రూ.22కి లభిస్తే.. పాలు కూడా అంతే ధరకు లభిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వారు తమ సొంత కంపెనీ హెరిటేజ్‌ కోసం ప్రభుత్వ సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారు. పోటీ వాతావరణం పూర్తిగా రాజీ పడిపోయే పరిస్థితికి వచ్చింది. గతంలో ప్రభుత్వ సహకార రంగం బలంగా ఉన్నప్పుడు పోటీ వాతావరణం ఉండేది. కాని కాలక్రమంలో ప్రభుత్వ సహకార డెయిరీలు రాజీ పడిపోయాయి.
సహకార డెయిరీలు కంపెనీల చట్టం కిందకు మారిపోయాయి:
కొన్ని రాజకీయ కుటుంబాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పోటీ వాతావరణాన్ని కల్పించి రైతులకు మంచి రేట్లు ఇవ్వాల్సింది పోయి.. చివరకు రాజీ పడిపోయాయి. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ కింద ఉన్న డెయిరీలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. అమూల్‌తో భాగస్వామ్యం ద్వారా ఈ రంగంలో మంచి మార్పులను ఆశిస్తున్నాం. రైతులకు, సహకార రంగానికి మేలు జరగాలని ఆరాటపడుతున్నాం. మహిళల కోసం వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా పథకాలను ప్రారంభిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఏటా రూ.18,750 చొప్పున చేయూత కింద నాలుగేళ్ల పాటు ఇస్తున్నాం:
ఆ విధంగా వారికి నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తాం:
ఆగస్టు 12న వైయస్సార్‌ చేయూత ప్రారంభిస్తున్నాం:
దాదాపు 25 లక్షల మహిళలు పథకంలో లబ్ధి పొందుతున్నారు:
స్వయం సహాయక సంఘాలకు చెందిన 90 లక్షల మహిళలకు ఏటా రూ.6700 కోట్లు వైయస్సార్‌ ఆసరా కింద ఇస్తున్నాం:
ఈ రెండు పథకాలకే ఏడాదికి రూ.11 వేల కోట్లు ఇస్తున్నాం:
ఈ సహాయం.. వారిలో ఆర్థిక ప్రమాణాల పెరుగుదలకు ఉపయోగపడాలన్నది లక్ష్యం:
తద్వారా మహిళల జీవితాలనే మార్చాలని ప్రయత్నిస్తున్నాం:
అమూల్‌తో భాగస్వామ్యం.. ఆ దిశలో మెరుగైన అడుగులు వేయాలి:
దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ గేట్‌వే లాంటిది:
బెంగుళూరు అనంతపురంకు సమీపంలో ఉంది, చెన్నై చిత్తూరుకు సమీపంలో ఉంది, అలాగే హైదరాబాద్‌ కూడా ఏపీ సరిహద్దుకు సమీపంలో ఉంది:
అలాగే విశాఖపట్నం కూడా ఒడిశాకు సమీపంలో ఉంది:
మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్‌ ఉంటుంది:
అలాగే మార్కెటింగ్‌ హబ్‌గా కూడా ఉంటుంది:
రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగానికి సంబంధించి మరిన్ని గొప్ప ఆలోచనలు చేయాలి:
రాష్ట్రంలో ఐఆర్‌ఎంఏ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌) ఏర్పాటు చేయండి:
పులివెందులలో ఇప్పటికే ఐజీ కార్ల్‌ ఉంది:
అక్కడ అన్ని రకాల సదుపాయాలూ ఉన్నాయి:
శిక్షణ, పరిశోధనలకు మంచి వేదిక అవుతుంది:
అమూల్‌తో భాగస్వామ్యం రాష్ట్రంలో మహిళల జీవితాలను  మారుస్తుందని భావిస్తున్నాం:
10,641 రైతు భరోసా కేంద్రాలు మాకు ఉన్నాయి:
వచ్చే రోజుల్లో వాటిలోనే పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం:
వెటర్నరీ అసిస్టెంట్, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లు కూడా అక్కడే ఉంటారు:
– సీఎం శ్రీ వైయస్‌ జగన్‌.

ఏపీలో పాడి పరిశ్రమకు మంచి భవిష్యత్‌ ఉంది:
– వీడియో కాన్ఫరెన్సులో ఆర్‌ఎస్‌ సోథి
గుజరాత్, ఏపీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి.
ఏపీలో కూడా గణనీయంగా రోజుకు 4 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది.
మహిళా సాధికారతకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు హర్షణీయం.
ఇప్పుడు అమూల్‌ కంపెనీతో ఒప్పందం, వారికి మరింత చేదోడుగా నిలవనుంది.
పాడి రైతులకు మంచి ధర లభించడంతో పాటు, అటు వినియోగదారులకు కూడా సరసమైన ధరలకు పాలు లభిస్తాయి. అమూల్‌ కంపెనీ వల్ల ఇప్పటికే చాలా రాష్ట్రాలలోని రైతులకు మేలు కలుగుతోంది. గత ఏడాది అమూల్‌ సంస్థ టర్నోవర్‌ రూ.52 వేల కోట్లు. ఇప్పుడు ఏపీతో ఎంఓయూ, ఇటు ఈ ప్రభుత్వానికి అటు అమూల్‌ కంపెనీకి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏపీ డైరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్ ఫెడరేషన్‌ (ఏపీడీడీసీఎఫ్‌) ఎండీ వాణీ మోహన్, అమూల్‌ కంపెనీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

   

Just In...