Published On: Tue, Jan 21st, 2020

‘అమ్మఒడి’ ఓ విప్లవాత్మకం…

* శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి కార్యక్రమం ఓ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డిని అభినందించాల్సిన అవసరముందన్నారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన జ‌రిగిన శాస‌న‌స‌భ‌లో అమ్మఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా పేద విద్యార్థులను సరిగా పట్టించుకోలేదని, దూరదృష్టితో సీఎం జగన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వంశీ కొనియాడారు. అమ్మఒడి పథకం వల్ల సంక్రాంతికి ముందే అందరు తల్లిదండ్రుల ముఖాల్లో పండగ వాతావరణం కనిపించిందని చెప్పారు. అమ్మఒడి వల్ల దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న చాలా కుటుంబాలు లబ్ధిపొందుతాయని, సీఎం జగన్‌ ఉన్నారన్న భరోసాతో వారి పిల్లలను పాఠశాలలకు పంపిస్తారని ఆయన అన్నారు. ఇదే స‌భ‌లో తొలుత తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారని అన్నారు. నాడు-నేడు పథకంతో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. గతంలో కార్పొరేట్‌ స్కూళ్లలో మాత్రమే ఇంగ్లీష్‌ మీడియం ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం వచ్చిందన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారని ఆమె పేర్కొంటూ ప్ర‌శంసించారు.

Just In...