Published On: Mon, Jul 15th, 2019

అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్రంపై ఉండాలి

* దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: అమ్మవారి కరుణ కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శాకంబరీ అమ్మవారిని కోరుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఉదయం ఫాలఫ్యాక్టరీ భీమనవారి వీధిలో ఉన్న విజయ‌ దుర్గ అమ్మవారి ఆలయంలోని శాకంబరీ అమ్మవారిని మంత్రి సోమ‌వారం దర్శించుకున్నారు. అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. వైసీపీ 30 డివిజన్ అధ్యక్షులు వెన్నం రజని, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.

Just In...