Published On: Tue, Feb 5th, 2019

అమ‌రావ‌తి సిగ‌లో మ‌రో రెండు ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులు

* మాల‌క్ష్మి నేతృత్వంలో అంత‌ర్జాతీయ విద్యాసంస్ధ‌, ఐదు న‌క్ష‌త్రాల హోట‌ల్‌

* ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో నేడు భూమి పూజ‌ 

* సామాజిక బాధ్య‌త మేర‌కు సేవా కార్య‌క్ర‌మాలు  

* స్టార్ హోటల్ కోసం హిల్ట‌న్‌తో ఒప్పందం

* గ్లెండేల్ భాగ‌స్వామ్యంతో బోర్డింగ్ స్కూల్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: అమ‌రావ‌తి రాజ‌ధాని సిగ‌లో మ‌రో రెండు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప్రాజెక్టులు చేర‌బోతున్నాయి. మాల‌క్ష్మి గ్రూపు నేతృత్వంంలో అంత‌ర్జాతీయ స్ధాయి విద్యాసంస్ధ‌తో పాటు ఐదు న‌క్ష‌త్రాల హోట‌ల్ సైతం న‌వ్యాంధ్రలో ఏర్ప‌డ‌నున్నాయి. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌లో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు సంస్ధ‌ల‌కు భూములు కేటాయించ‌గా, మాల‌క్ష్మి గ్రూప్ త‌న‌దైన శైలిలో వేగంగా ముంద‌డుగు వేసింది. నిర్ణీత కాలంలోనే ప్ర‌తిష్టాత్మ‌క సంస్ధ‌ల‌ను ఏర్పాటు చేసేలా యుద్ధ ప్రాతిప‌దిక‌న కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేస్తోంది. ప్ర‌తిష్టాత్మ‌క సంస్ధ‌ల‌కు సంబంధించిన భూమి పూజ బుధ‌వారం జ‌ర‌గ‌నుంది. రూ.200 కోట్ల అంచ‌నా వ్య‌యంతో మాల‌క్ష్మి డ‌బుల్ ట్రీ బై హిల్ట‌న్ పేరిట ఏదు న‌క్ష‌త్రాల హోట‌ల్ రూపుదిద్దుకోనుంద‌ని ఈ సంద‌ర్భంగా సంస్ధ వ్య‌వస్ధాప‌కులు వై.హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్ తెలిపారు. నాలుగు ఎక‌రాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగుల‌తో మాలక్ష్మి డ‌బుల్ ట్రీ అమ‌రావ‌తికే ప్ర‌తిష్టాత్మ‌కంగా అవ‌త‌రించ‌నుంద‌న్నారు. 2000 మంది ఏక‌కాలంలో వీక్షించ‌గ‌లిగేలా కన్వేన్ష‌న్ సెంట‌ర్‌, వ‌ర‌ల్డ్ క్లాస్ స్విమ్మింగ్ పూల్‌, స‌ర్వీస్ అపార్ట్‌మెంట్స్ సైతం ఈ నిర్మాణంలో అంత‌ర్భాగంగా ఉంటాయ‌న్నారు. నిజానికి రాష్ట్రాధినేత చంద్రబాబు నాయిడు ప‌లు సంస్ధ‌ల‌కు భూములు కేటాయించిన‌ప్ప‌టికీ వివిధ ఒప్పందాల త‌దుప‌రి తాము తొలిగా భూమి పూజ‌కు రాగ‌ల‌గ‌టం ఆనందాన్ని ఇస్తుంద‌ని హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్ పేర్కోన్నారు. మాల‌క్ష్మి ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి సందీప్ మండ‌వ మాట్లాడుతూ ఐదు న‌క్ష‌త్రాల హోట‌ల్ రంగంలో అగ్ర‌గామి బ్రాండ్‌గా పేరు గాంచిన హిల్ట‌న్‌తో తాము భాగ‌స్వామ్యం అయ్యామ‌న్నారు. మ‌రోవైపు ఎనిమిది ఎక‌రాల విస్తీర్ణంలో మాల‌క్ష్యి గ్లెండేల్ పేరిట నిర్మించ‌నున్న అంత‌ర్జాతీయ విద్యాసంస్ధ‌ను రానున్న విద్యాసంవ‌త్స‌రం నాటికే అమ‌రావ‌తి వాసుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌న్న ధ్యేయంతో వేగంగా ముంద‌డుగు వేస్తున్నామ‌ని మండ‌వ పేర్కోన్నారు. ఇందుకోసం రూ.80 కోట్లు వ్య‌యం చేస్తున్నామ‌న్నారు.
              గ్లెండేల్ విద్యాసంస్ధ‌ల డైరెక్ట‌ర్ అంజుమ్ బాబూఖాన్ మాట్లాడుతూ ఇక్క‌డ కేంబ్రిడ్జ్ సిల‌బ‌స్‌ను చిన్నారుల‌కు బోధించ‌టం జ‌రుగుతుంద‌ని, విద్యార్ధి ఉపాద్యాయిల నిష్ప‌త్తి ప‌రంగానూ తాము నూత‌న అధ్యాయానికి నాంది ప‌లుకుతున్నామ‌ని తెలిపారు. సాధార‌ణ బోర్డింగ్ విధానానికి భిన్నంగా చిన్నారులు త‌మ త‌ల్లిదండ్రుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేలా డే బోర్డింగ్‌, వీక్ బోర్డింగ్ వంటి సేవ‌ల‌ను అందుబాటులో ఉంటాయ‌న్నారు. డే బోర్డింగ్‌లో మ‌ధ్యాహ్నం భోజ‌నం, సాయంత్రం అల్పాహారం అందిస్తామ‌ని, వీక్ బోర్డింగ్ సోమ‌వారం ఉద‌యం ప్రారంభ‌మై శుక్ర‌వారం సాయంత్రం ముగుస్తుంద‌ని అంజుమ్ బాబూఖాన్ తెలిపారు.  సీడ్ యాక్సిస్ రోడ్డులో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్ధాన‌ముల నేతృత్వంలో నిర్మాణం జ‌రుపుకుంటున్న శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి  వారి దేవాల‌యం ఎదురుగా ఫిబ్ర‌వ‌రి ఆర‌వ తేదీన బుధ‌వారం భూమిపూజ చేప‌ట్ట‌నున్నామ‌ని హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్ వివ‌రించారు. ఈ వెంచ‌ర్ల ద్వారా అద్బుత అమ‌రావ‌తి నిర్మాణంలో తాము భాగ‌స్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉంద‌ని, త‌మ‌కు నిరంత‌ర స‌హ‌కారం  అందిస్తూ అమ‌రావ‌తి నిర్మాణం కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయిడు, పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్‌ల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఙ‌త‌లు తెలుపుతున్నామ‌న్నారు. సిఎంకు చేదోడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న మంత్రి నారాయ‌ణ‌, సిఆర్‌డిఎ క‌మీష‌న‌ర్ శ్రీ‌ధ‌ర్, ఇత‌ర అధికారుల సేవ‌లు కూడా మ‌రువ‌లేమ‌న్నారు. మరో వైపు సామాజిక బాధ్యతను గుర్తెరిగి మాలక్ష్మీ, గ్లెండేల్ సంస్ధ‌లు  అమరావతి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో తొలుత తుళ్ళూరు మండలంలోని పాఠశాలను ఎంపిక చేసుకోగా, దశలవారీగా  ఈ సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. మరోవైపు రాజధాని పరిధిలోని మూడు మండలాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలోని 100 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదు వేలు ఉపకార వేతనంగా ఇవ్వాలని నిర్ణయించామ‌ని గ్లెండేల్ విద్యాసంస్ధ‌ల అధినేత స‌ల్మాన్ బాబూఖాన్ తెలిపారు. ప్ర‌తి పాఠ‌శాల నుండి ఐదుగురు మెరిట్ విద్యార్ధుల‌ను ఎంపిక చేస్తామ‌న్నారు.
 

Just In...