Published On: Sat, Feb 16th, 2019

అమ‌ర జ‌వాన్ల‌కు ఏపీ ప్ర‌భుత్వం అండ‌

* ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్ర‌క‌ట‌న‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: వీర జవాన్ల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని శ‌నివారం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకారమని చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మనిషి ప్రాణాలు బలితీసుకునే ఈ తరహా దారుణాలు అత్యంత హేయమైనవిగా ఆయ‌న అభివర్ణించారు. ఉగ్రవాదం అణచివేతలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తమ వంతు సహకారం అందించాలని కోరారు. అమ‌ర జవాన్ల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంద‌న్నారు.

Just In...