Published On: Fri, Dec 28th, 2018

అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా

* ఒకరి మృతి, 15 మంది భ‌క్తుల‌కు గాయాలు

* న‌లుగురి ప‌రిస్థితి విష‌మం

సెల్ఐటి న్యూస్‌, క్రైం డెస్క్‌: చిత్తూరు జిల్లా మదనపల్లె వద్ద శుక్రవారం తెల్లవారుజామున జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర విషాదం నెల‌కొంది. మదనపల్లె బైపాస్‌రోడ్డు వద్ద అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. శబరిమల నుంచి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులను అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు మండలం దాదిరెడ్డిపల్లి వాసులు. మృతున్ని తిరుపాల్‌రెడ్డిగా(45)గా పోలీసులు గుర్తించారు. 41 మంది అయ్యప్ప భక్తులు ఈ నెల 25న శబరిమల వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మదనపల్లె పట్టణ సరిహద్దు బైపాస్‌రోడ్డులోని ఆర్టీవో కార్యాలయం వద్ద లారీని ఓవర్‌టెక్‌ చేయబోయి వీరు వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. క్షతగాత్రుల్లో చంద్ర, లావణ్యమ్మ, రామానుజులమ్మ, సాలెమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్ష‌త‌గాత్రుల‌కు ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

Just In...