Published On: Tue, Aug 13th, 2019

అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలి

* ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

సెల్ఐటి న్యూస్, అరావతి: పవిత్రమైన బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం ప్రజలకు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాల’ని ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్‌ శుభాకాంక్షలంటూ ఆయన పేర్కొన్నారు.

Just In...