Published On: Fri, May 29th, 2020

అసభ్య పోస్టులు పెట్టిన మరో 44 మందికి హైకోర్టు నోటీసులు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అసభ్య పోస్టులు పెట్టిన సుమోటో కేసుపై కొత్తగా మరో 44 మందికి హైకోర్టు శుక్ర‌వారం నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే 49 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనే అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో సీఐడీ అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణను మూడు వారాల తర్వాతకు ధర్మాసనం వాయిదా వేసింది.

 

Just In...