అసెంబ్లీ ముట్టడించి తీరుతాం
* జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
గుంటూరు, సెల్ఐటి న్యూస్: పాలనలో జగన్ ప్రభుత్వం విఫలమైందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. నివార్ తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోలేదన్నారు. నిధుల గురించి కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం జగన్‌కు లేదన్నారు. నీతి ఆయోగ్‌లో రైతుల పంట నష్టం గురించి సీఎం ఎందుకు ప్రస్తావించలేదు? అని ఆయన ప్రశ్నించారు. రైతుల కోసం అసెంబ్లీని సమావేశాల తొలి రోజునే ముట్టడించి తీరుతామని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలపై కక్ష్య పూరితంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలెంటీర్లును పూర్తిగా రాజకీయాలకు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.