Published On: Mon, Jul 20th, 2020

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ

* కొత్తగా 4074 కరోనా పాజిటీవ్ కేసులు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడ‌చిన 24 గంటల్లో కొత్తగా 4074 కరోనా పాజిటీవ్ కేసులు న‌మోదు కాగా.. 54 మరణాలు సంబ‌వించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 53,724కు చేరింది. మొత్తం 33,580 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కోసం చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 28,800గా ఉంది. ఇప్పటివరకు 24,228 మంది కరోనా నుంచి కోలుకోగా.. 696 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. అలాగే కృష్ణా జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో ఏడుగురు మృతి చెందగా, 129 కొవిడ్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

Just In...