Published On: Tue, Jun 4th, 2019

ఆకలి, అవినీతి లేని సమాజం కావాలి

* శ్రీవారిని ద‌ర్శించుకున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు

సెల్ఐటి న్యూస్‌, తిరుమల: తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయానికి వచ్చిన ఆయనకు మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉపరాష్ట్రపతి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఆకలి, అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. వర్షాలు బాగా కురవాలి, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా చూడాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రముఖులు దర్శనానికి రావాలని, తద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. తాను రాజకీయాల్లో లేనని, భవిష్యత్తులోనూ ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు. అసమానతలు, ఘర్షణలు లేని సమాజం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. దేశానికి సేవ చేసుకునే శక్తి ఇవ్వాలని, దైవదర్శనం, సాహిత్యం, సత్సంగంతో ఆ శక్తి వస్తుందని విశ్వసిస్తున్నట్టు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Just In...