Published On: Fri, Jun 12th, 2020

ఆక్వా రంగం మరింత బలోపేతం

* మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ

కాకినాడ, సెల్ఐటి న్యూస్‌: ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలెక్టర్‌ కార్యాలయంలో ఆక్వా కల్చర్‌ అథారిటీ సమావేశంలో భాగంగా ఆక్వా రైతులు, హేచరీల ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. కొవిడ్‌ సమయంలో ఈ రంగం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొందని.. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. ప్రైవేటు రంగంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఆక్వా అని.. అలాంటి వ్యవస్థను గత ప్రభుత్వాలు విస్మరించాయని మంత్రి విమర్శించారు. ఆక్వా రంగం ప్రోత్సాహానికి అవసరమైన ప్రతిచోట రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా సీడ్‌ కొరత, ఎగుమతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Just In...