Published On: Fri, Jul 10th, 2020

ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం రోజున పట్టాల పంపిణీ

* ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సీఎం సమీక్ష

అమరావతి బ్యూరో, సెల్ఐటి న్యూస్‌: అటవీ భూములపై సాగు హక్కుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న గిరిజనులకు ప్రయోజనం కల్పించాలని, అర్హత ఉన్న వారందరికీ సాగు హక్కులు కల్పించాలని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తాడేప‌ల్లిలోని విడిది కార్యాల‌యంలో శుక్ర‌వారం ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సీఎం .జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. స‌మావేశంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, రెవిన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు హాజర‌య్యారు. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం రోజున పట్టాల పంపిణీ చేయాల‌ని, క్లెయిములను పరిశీలించి గిరిజనులకు మేలు చేయాలని సీఎం సూచించారు. అటవీ భూములపై సాగు హక్కుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న గిరిజనులకు ప్రయోజనం కల్పించాలని, అర్హత ఉన్న వారందరికీ సాగు హక్కులు కల్పించాలని సీఎం పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చాక ఆయా భూముల అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఆ భూముల్లో ఏం సాగు చేయాలన్న దానిపై కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాల‌న్నారు. దీనిపై వ్యవసాయ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. దీని కోసం గిరిభూమి పేరుతో పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని అధికారులు వెల్ల‌డించారు.

 

Just In...