Published On: Tue, Apr 17th, 2018

ఆటా నుంచి కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతంకు ఆహ్వానం

* “అమెరికన్ తెలుగు కన్వెన్షన్”కు అతిథిగా హాజ‌రు కావాల‌ని కోరిన ఆటా..టాటా ప్ర‌తినిధులు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: అమెరికాలోని డ‌ల్లాస్ న‌గ‌రంలో మే 31 నుండి మూడు రోజుల పాటు జరగనున్న “అమెరికన్ తెలుగు కన్వెన్షన్” కు కృష్ణాజిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆహ్వానం అందుకున్నారు. నవ్యాంధ్రప్ర‌దేశ్‌లోని  అమరావతి రాజధాని ప్రాంతంలో జిల్లా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకుని ప‌రిపాలనలో సమర్థవంతంగా వినియోగిస్తున్న నేపధ్యంలో అమెరికా తెలుగు కన్వెన్షన్‌కు అతిధిగా హాజరు కావాల్సిందిగా ఆటా అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, టాటా (తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్) అధ్యక్షుడు హారినాధ పొలిచర్లలు సంయుక్తంగా సోమ‌వారం ఆహ్వానం పంపారు. ఈ కన్వెన్షన్‌లో సుమారు 4,500 మందికి పైగా తెలుగు నేపధ్యం ఉన్న కవులు, రచయితలు, మేథావులు, బాషావేత్తలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు,  ఔత్సాహికులు, ప్రతిభావంతులు, యువత పాల్గొంటార‌ని క‌లెక్ట‌ర్‌కు పంపిన ఆహ్వానంలో ఆటా, టాటా ప్ర‌తినిధులు తెలిపారు.

Just In...