Published On: Mon, Sep 4th, 2017

ఆన్‌లైన్‌లో 50,789 సేవా టికెట్లు..

* ఆన్‌లైన్‌ లక్కీడిప్‌లో 6,699 టికెట్లు

* పాత పద్ధతిలోనే 44,090 టికెట్ల కేటాయింపు

సెల్ఐటి న్యూస్‌, తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగంగా డిసెంబర్‌కు సంబంధించి మొత్తం 50,789 టికెట్లను శుక్రవారం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్టు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. లక్కీడిప్‌లోని మొత్తం 6,699 టికెట్లలో సుప్రభాతం 4,099, తోమాల 60, అర్చన 60, అష్టదళ పాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,300 ఉన్నాయి. వీటిని వారం రోజులపాటు anilkumar_singhal_1నమోదు చేసుకున్న భక్తులకు అదే రోజు కంప్యూటర్‌ లక్కీడిప్‌ ద్వారా టికెట్లు కేటాయిస్తారు. తర్వాత 3 రోజుల్లో నగదు చెల్లించాలి. నగదు చెల్లింపు చేయని టికెట్లను లక్కీడిప్‌లో ఇతర భక్తులకు కేటాయించనున్నారు. మిగిలిన 44,090 సేవా టికెట్లలో కల్యాణోత్సవం 10,125, ఊంజల్‌ సేవ 2,700, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,610, సహస్ర దీపాలంకార సేవకు 12,350, విశేషపూజ 1,500 సేవా టికెట్లు పాత పద్ధతిలోనే భక్తులు పొందనున్నారు.

సర్వదర్శనానికి టైంస్లాట్‌..!

తిరుమలలో క్యూలైన్ల నివారణ కోసం సర్వ దర్శనానికి టైంస్లాట్‌ విధానం అమలు చేసే యోచన చేస్తున్నామని, డిసెంబర్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నా మని సింఘాల్‌ అన్నారు. ఈ నెలాఖరులోగా ttdsevaonline.com  వెబ్‌సైట్‌ను తెలుగులో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం 7 రోజులపాటు నిర్వహిస్తున్న శ్రీవారి సేవలో మూడు, నాలుగు రోజులపాటు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. హుండీలో లభించిన పాత నోట్లను ఏమి చేయాలనే విషయంలో కేంద్రం నుంచి త‌మ‌కు ఇంకా ఆదేశాలు అందలేదన్నారు.

Just In...