Published On: Tue, Sep 22nd, 2020

ఆప్కో చేనేత వస్త్రాలను ఆదరించండి

* బంపర్ ఆఫర్స్ ను వినియోగించుకోండి

* ఆప్కో వస్త్రాల అమ్మకాలపై 30 శాతం రాయితీ

* ఆప్కో మేనేజర్ గోపాల‌కృష్ణ ‌

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌: చేనేత కళాకారులు అత్యంత నైపుణ్యంతో అధునాతన డిజైన్లతో రూపొందించిన ఆప్కో చేనేత వస్త్రాలను ఆదరించి ఆప్కో వస్త్రాలపై అందిస్తున్న బంపర్ ఆఫర్స్ మరియు రాయితీలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ ఆప్కో ప్రధాన షోరూం మేనేజరు వై.గోపాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆప్కో వస్త్ర విక్రయశాలల ద్వారా ఎంపిక చేయబడిన చేనేత వస్త్రాలు ఒకటి కొన్నవారికి మరొకటి ఉచితం, ఒకటికొన్నవారికి రెండు వస్త్రాలను ఉచితంగా అందించే ఆఫర్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దీంతోపాటు ఆప్కో వస్త్రాలపై 30 శాతం రాయితీ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు వారి కళానైపుణ్యంతో రూపొందించిన అధునాతనమైన డిజైన్ల ను వినియోగదారులకు అందుబాటు ధరల్లో అమ్మకాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రసిద్ధి చెందిన మంగళగిరి, బందరు, రాజమండ్రి, చీరాల కాటన్ చీరలు ఉప్పాడ, వెంకటగిరి, మాధవరం కాటన్ మరియు పట్టుచీరలు, డ్రస్ మెటీరియల్స్, దుప్పట్లు, టవల్స్, లుంగీలు, తదితర చేనేత వస్త్రాలపై 30 శాతం రిబేటు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆప్కో డివిజినల్ మేనేజరు యస్ వివి. ప్రసాద రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ ఏలూరు రోడ్డులోని రామమందిరం ప్రక్కవీధి లోగల ఆప్కో మెగా షోరూంతో పాటు ఆప్కో అమరావతి షోరూం మరియు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గల అన్ని అప్కో షోరూంల నందు అక్టోబరు 31వ తేదీ వరకూ పై ఆఫర్లు సౌకర్యం వినియోగదారులకు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని చేనేత వస్త్రాభిమానులు ప్రజలు సద్వినియోగం చేసుకుని చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సహించాలని గోపాలకృష్ణ కోరారు.

Just In...