Published On: Sun, Sep 8th, 2019

ఆరెల్ డిజైన్ స్టూడియోస్ ప్రారంభం

* లాంఛనంగా ప్రారంభించిన మౌనరాగం ఫేమ్ ప్రియాంక జైన్

* ఫ్యాషన్ షోలో హొయలొలికించిన అందాల భామలు

సెల్ఐటి న్యూస్, విజయవాడ: నవతరం అతివల అభిరుచులకు అనుగుణంగా, అధునాతన వస్త్ర శ్రేణితో కొలువుదీరిన ఆరెల్ డిజైన్ స్టూడియోస్ ఫ్యాషన్ ప్రియులైన నగరవాసులను తప్పక ఆకట్టుకుంటుందని ప్రముఖ టీవీ నటి, మౌనరాగం ఫేమ్ ప్రియాంక జైన్ పేర్కొన్నారు. గురునానక్ కాలనీలోని జెమ్స్ ఫెమీ వరల్డ్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆరెల్ డిజైన్ స్టూడియోస్ ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రియాంక జైన్ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని ప్రాంత మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ స్టూడియోస్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాలతో పాటు ప్రత్యేకతను కోరుకునే వారి కోసం వినూత్నమైన డిజైనర్ వస్త్రాలు ఆరెల్ లో అందుబాటులో ఉన్నాయని, వేర్వేరు ప్రాంతాల నుండి సేకరించిన డిజైనర్ వస్త్రాలకు ఏకైక గమ్యస్థానంగా ఆరెల్ డిజైన్ స్టూడియోస్ నిలుస్తుందని అన్నారు. బొటిక్ అధినేత బండి ఉష మాట్లాడుతూ తమ డిజైన్ స్టూడియోస్ నందు వివిధ సందర్భాల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విస్తృత శ్రేణి వస్త్రాలు లభిస్తాయని అన్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా డిజైనర్ వస్త్రాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అందించడం ఆరెల్ ప్రత్యేకత అని ఆమె తెలిపారు. వెస్ట్రన్ డ్రెస్సెస్, ఫార్మల్ వేర్, ఎథ్నిక్ వేర్, బ్రైడల్ వేర్, వెడ్డింగ్ శారీస్ తో పాటు ఆరెల్ ప్రత్యేక కలెక్షన్ వస్త్రాలు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తాయన్నారు. ప్రారంభోత్సవ సందర్భంగా పూర్తి వస్త్ర శ్రేణిపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు బండి ఉష ప్రకటించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ జి.శ్రీదేవి మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫిట్ నెస్ సెంటర్, అడ్వాన్స్డ్ బ్యూటీ కేర్ సేవలు అందుబాటులో ఉన్న జెమ్స్ ఫెమీ వరల్డ్ ప్రాంగణంలో ఆరెల్ డిజైన్ స్టూడియోస్ ప్రారంభించడం హర్షణీయమన్నారు. ఆరెల్ డిజైనర్ వస్త్రాలు నగరవాసులను తప్పక ఆకట్టుకుంటాయని డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు. బొటిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షో అత్యంత ఆహ్లాదకరంగా సాగింది. డిజైనర్ వస్త్రాలు ధరించిన అందాల భామలు ర్యాంప్ పై హొయలొలికించారు.

Just In...