Published On: Wed, Nov 14th, 2018

ఆరోగ్యానికి చిరునామాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉండాలి

* గ‌ర్భిణీ, చిన్న‌పిల్ల‌ల ఆరోగ్యంపై శ్ర‌ద్ధ చూపాలి

* ఉద్దానంలో కిడ్నీ సూప‌ర్‌స్పెషాలిటీ ఆసుప‌త్రి

* ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అద‌నంగా 1200 బెడ్స్‌

* ఆషా ఆత్మీయ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: పేద‌వారి ఆరోగ్యం ఆషా వ‌ర్క‌ర్లు చూసుకుంటే వారి బాధ్య‌త‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో మంగ‌ళ‌వారం ఉద‌యం నిర్వ‌హించిన ఆషా వ‌ర్క‌ర్ల ఆత్మీయ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. ఆషా కార్య‌క‌ర్త‌ల‌ను చూస్తే ధైర్మం, ఉత్తేజం వ‌స్తుంద‌ని గ్రామాల్లో ఎమ్‌.ఎమ్‌.ఆర్‌, ఐఎమ్ఆర్ మ‌ర‌ణాలు ఇక లేకుండా చూడ‌డంలో ఆషా వ‌ర్క‌ర్లు ప్ర‌ముఖ పాత్ర పోషించాల‌ని కోరారు. కష్టపడి పనిచేసే ఆషా కార్యకర్తలు నెల‌కు రూ.8,600 వరకు సంపాందిచుకోవచ్చని చెప్పారు. రాష్ట్రం నలుమూలలా ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న ఆశాలను సీఎం అభినందించారు. గౌరవ వేతనాన్ని కేవలం రూ.6వేలకు పరిమితం చేయడంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆశాలు అండగా ఉంటే.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆశాలను ఆదుకునేందుకు మరిన్ని కార్యక్రమాలు రూపొందిస్తామని సీఎం వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేయడం ద్వారా క్షేత్రస్థాయిలో మాతాశిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అంతకుముందు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం చంద్ర‌బాబు నాయుడు పరిశీలించి వైద్య సేవలు అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ ఆషా వ‌ర్క‌ర్ల‌ను సీఎం చంద్ర‌బాబు స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు కిడారి శ్రావ‌ణ్‌కుమార్‌, దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, శాస‌న‌మండ‌లి స‌భ్యులు టి.డి.జ‌నార్థ‌న్‌, మ‌హిళా క‌మీష‌న్ చైర్‌ప‌ర్స‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి, జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ గ‌ద్దె అనూరాధ‌, న‌గ‌ర మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ గోగుల ర‌మ‌ణారావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ అరుణ్‌కుమార్‌, కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం, 13 జిల్లాల నుంచి ఆషా వ‌ర్క‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

జాతి మనుగడ కోసం భాజపాను చిత్తుగా ఓడించాలి…

రాష్ట్రానికి సహాయ నిరాకరణ చేసినందునే కేంద్రంతో తెగదెంపులు చేసుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. దేశం నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక శక్తులతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా, దాడులతో వేధింపులకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని పేర్కొంటూ సీబీఐ, ఆర్బీఐ వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను సైతం సంక్షోభంలోకి నెట్టేశారని దుయ్యబట్టారు. తెలుగు జాతి మనుగడ కోసం భాజపాని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Just In...