Published On: Sat, Apr 20th, 2019

ఆరో నెలలో పుట్టిన నవజాత శిశువుకి గుండె సర్జరీ

* విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన ఆంధ్రా ఆసుప‌త్రి వైద్యులు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఆరో నెలలో జన్మించిన న‌వ‌జాత శిశువుకు హార్ట్ ఆపరేషన్‌ను ఆంధ్ర ఆసుప‌త్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడలోని ఆంధ్రా ఆసుప‌త్రిలో శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆసుప‌త్రి చీఫ్ చిల్డ్రన్స్ సర్వీస్ మరియు డైరెక్టర్ డాక్ట‌ర్ పి.వి.రామారావు మాట్లాడుతూ 6 నెలలు కూడా పూర్తిగా నిండకుండా శిశువు జన్మించ‌టం చాలా అరుదు అన్నారు. ఆ శిశువుకు ఆర్థ్‌యోసిస్ ఉన్నట్లు హాస్పిటల్ వైద్యులు గుర్తించి, శిశువుకు ఊపిరితిత్తులు కూడా సరిగా ఎదుగుదల లేకపోవడం వలన వెంటిలేటర్ మీద ఉంచటం జరిగిందని తెలిపారు. 25 వారాలకే గుండె అపరేషన్ చేయటం కష్టం  అని చెప్పారు. శిశువు తల్లిదండ్రులు కోరిక మీద పుట్టిన కొన్ని రోజుల్లోనే ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో వుంచి ఆంధ్ర హాస్పిటల్ వైద్య బృందం డాక్టర్ దిలీప్, డాక్టర్ విక్రమ్ వైద్యుల బృందం ఆధ్వ‌ర్యంలో చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ నిర్వాహచామని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం శిశువు వయసు 3నెలలు, బరువు  800 గ్రాములు ఉంద‌న్నారు. పాలు బాగా తీసుకుంటుంద‌ని తెలిపారు. ఇoటెన్సీవ్ కేర్ యూనిట్ మరియు గుండె జబ్బుల వైద్య నిపుణుల బృందం సమ‌ష్టి కృషి వల్ల‌నే ఇది సాధ్యపడిందని పేర్కొంటూ ఈ సంద‌ర్భంగా వైద్య బృందాన్ని అభినందించారు.

Just In...