Published On: Tue, Sep 17th, 2019

ఆశతో ప్రజలు మన దగ్గరకు వస్తారు…

* వారి స్థానంలో మ‌నం ఉంటే అనేవిధంగా ఆలోచించాల‌ని అధికారుల‌కు దిశానిర్దేశం

* స్పందనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ సమీక్ష

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: స్పందనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంగ‌ళ‌వారం సమీక్ష నిర్వ‌హించారు. స్పందన ద్వారా అందే వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం అధికారులకు వర్క్‌షాపులు ఉంటాయ‌ని సీఎం తెలిపారు. దీనిపై కార్యాచరణ ప్రణాళిక తయారుచేశాం అన్నారు. ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు వర్క్‌షాపులుంటాయ‌ని తెలిపారు. మ‌నం సమస్యలు తీరుస్తామన్న ఆశతో ప్రజలు మన దగ్గరకు వస్తార‌ని, వినతులు ఇచ్చేవారి స్థానంలో మనం ఉంటే.. ఎలా ఆలోచిస్తామో.. అదే రీతిలో మనం స్పందించాల‌ని సీఎం పేర్కొన్నారు. అప్పుడే స్పందనకు ఆర్థం ఉంటుంద‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు మరింత మానవీయ దృక్పథంతో వినతులకు పరిష్కారం చూపాల‌న్నారు. దీనికోసమే ఈ వర్క్‌ షాపులు నిర్వ‌హ‌ణ అని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈనెల 24, 27 తేదీల్లో వర్క్‌ షాపు ఉంటుంద‌న్నారు.
• అక్టోబరులో జిల్లాల స్థాయిలో రెండురోజులపాటు వర్క్‌ షాపులు : సీఎం
• దిగువస్థాయి అధికారులకు మరింత మోటివేషన్‌ పెంచడమే దీని ఉద్దేశం: సీఎం
• కలెక్టర్లు కూడా ఈ వర్క్‌ షాపులో పాల్గొనాలి: సీఎం
• నవంబర్‌ నెల నుంచి స్పందన వినతుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంటుంది: సీఎం
• గ్రామ సెక్రటేరియట్లను అక్టోబరు 2 నుంచి ప్రారంభిస్తున్నాం: సీఎం
• గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి: సీఎం
• కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబరు నుంచి ఇవ్వాలి : సీఎం
• అక్టోబరు, నవంబరు నెలల్లో సామాజిక తనిఖీలు పూర్తిచేయాలి: సీఎం
• గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ అందుబాటులోకి రాగానే అక్కడే డిస్‌ప్లే ఉండాలి: సీఎం
• రేషన్‌కార్డులు, పెన్షన్లు ఉన్నవారి జాబితాను బోర్డులో పెట్టాలి: సీఎం
• ఇళ్లపట్టాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా పెట్టే ప్రయత్నంచేయాలి: సీఎం
• ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను పెట్టాలి:
• ఈ జాబితామీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, పథకం ఎవ్వరికీ అందకపోయినా ఆ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలి: సీఎం
• అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలి: సీఎం
• వారికి అందించాల్సిన ధర్మం, బాధ్యత మనదే: సీఎం

సొంతంగా ఆటో, ట్యాక్సీ, మాక్సీ కాబ్‌లు నడుపుకుంటున్నవారికి ఏడాదికి రూ.10వేల పథకంపై రివ్యూ:
• దరఖాస్తులు తీసుకోవడం, వాటికి తనిఖీలు, ఆమోదంపై సీఎం సమీక్ష
• ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లస్థలాల పంపిణీపై సీఎం సమీక్ష
• లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్‌ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
• సెప్టెంబరు ఆఖరు నాటికి డేటా కలెక్షన్, వెరిఫికేషన్‌ పూర్తికావాలన్న సీఎం
• అక్టోబరు చివరి నాటికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి ఎంతో తేల్చాలన్న సీఎం
• నవంబర్‌ నుంచి అవసరమైన చోట భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకావాలన్న సీఎం
• ఈ కార్యక్రమం మీద అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం
• వైయస్సార్‌ కంటి వెలుగు కింద 5.3 కోట్లమంది ప్రజలకు కంటి పరీక్షలు: సీఎం
• ఆరు విడతలుగా కార్యక్రమం: సీఎం
• మూడేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటికి సంబంధించిన వైద్యం అందేలా చర్యలు : సీఎం
• అక్టోబరు 10నుంచి 16 వరకూ తొలిదశ
• అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు కంటిపరీక్షలు : సీఎం
• రెండో విడత కార్యక్రమం నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకూ: సీఎం
• 3,4,5,6 విడతలు ఫిబ్రవరి 1 , 2020 నుంచి : సీఎం
• పిల్లలకు అయిపోయిన తర్వాత మిగిలిన ప్రజలకు అందరికీ పరీక్షలు, చికిత్సలు దశలవారీగా అందిస్తాం: సీఎం
• జిల్లాల్లో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు: సీఎం
• పటిష్టంగా ఈ కార్యక్రమం అమలు కావాలి: సీఎం
• కంటి వెలుగు కార్యక్రమంకోసం చేసిన ఏర్పాట్లను సమీక్షించిన సీఎం
• ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించామన్న అధికారులు
• మొదటి స్క్రీనింగ్‌లో చికిత్స అవసరమున్న విద్యార్థులను గుర్తించి ఆమేరకు వారికి తదుపరి చికిత్స అందిస్తామన్న అధికారులు
• రూ.560 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం
• స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స, ఇతర కార్యక్రమాలన్నీ వైయస్సార్‌ కంటి వెలుగు కింద చేపట్టనున్న ప్రభుత్వం
పౌష్టికాహార లోపం, రక్తహీనతను అధిగమించడంపై సీఎం సమీక్ష :
• గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఈసమస్యను అధిగమించవచ్చన్న విశ్వాసం నాకు ఉంది: సీఎం
• పౌష్టికాహార లోపంతో పిల్లలు, తల్లులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల్లోని పేదరికంతో ఉన్న మహిళలను ఆ సమస్యనుంచి గట్టెక్కించాలి: సీఎం
• ప్రభుత్వం ఇంతగా ఖర్చుచేస్తున్నా… పౌష్టికాహార లోపం ఎందుకు వస్తోందన్న సీఎం
• అవసరమైతే మరింత ఖర్చు చేద్దాం, కాని సమస్యలు తీరాలి: సీఎం
• వాలంటీర్లు ప్రతి ఇంటినీ సర్వేచేసి, పిల్లలను, తల్లులను, మహిళలను అంగన్‌వాడీ కేంద్రాల దగ్గరకు వెళ్లేలా మోటివేట్‌ చేయండి: సీఎం
• అక్కడ వారికి పరీక్షలు నిర్వహించండి: సీఎం
• పౌష్టికాహారలోపం, ఎనీమియా పరీక్షలు నిర్వహించండి: సీఎం
• పరీక్షలు నిర్వహించిన తర్వాత వారి ఆరోగ్య కార్డులో పొందుపరిచి ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాలి: సీఎం
• మానిటరింగ్‌ బాధ్యత కూడా వాలంటీర్లకు అప్పగించాలి: సీఎం
• అంగన్‌వాడీల ద్వారా ఏమేమి ఇవ్వబోతున్నామో వాలంటీర్లకు సమాచారం ఇచ్చి, ఆమేరకు అవన్నీ కూడా పిల్లలకు, తల్లులకు అందేలా చూడాల్సిన బాధ్యత ఉంది: సీఎం
• పారిశుద్ధ్యం, ఆహారం, తాగునీటిపైనా ప్రజలకు అవగాహన కల్పించాలి: సీఎం
• వచ్చే సమీక్షా సమావేశానికి దీనిపై ఏం చర్యలు తీసుకున్నారన్నదానిపై నివేదించాలని సీఎం ఆదేశం
• పౌష్టికాహారలోపం, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రూ.43 లు రోజుకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం: సీఎం
• అలాగే పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులకు రూ.18లు రోజుకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం: సీఎం
రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలపై సీఎం సమీక్ష:
• కర్నూలు, కడప, ప్రకాశం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల సమాచారం వస్తోంది: సీఎం
• అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశం
• అనంతపురంలో చిరుధాన్యాల విత్తనాలను పంపిణీ చేస్తున్నామని చెప్పిన అనంతపురం కలెక్టర్‌
• వచ్చే ఏడాదినాటికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో నింపేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలన్న సీఎం
• 117 టీఎంసీల నీరు వెళ్లినా రిజర్వాయర్లు నిండలేదంటే.. కాల్వల పరిస్ధితి ఎలా ఉందో అర్థమవుతుందోన్న సీఎం
• వరదజలాలు సద్వినియోగం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం
ఇసుక కొరతపై కలెక్టర్లతో సీఎం సమీక్ష:
• వర్షాలు, వరదల కారణంగా ఇసుక అందుబాటులోకి రాలేదన్న అధికారులు
• గోదావరి, కృష్ణా నదుల్లో ఇంకా ప్రవాహాలు ఉన్నాయన్న అధికారులు
• వరద తగ్గిన వెంటనే రీచ్‌లు అందుబాటులోకి వస్తాయన్న అధికారులు
• వరద తగ్గగానే వీలైనంత ఇసుకను స్టాక్‌యార్డుల్లోకి తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశం
• కౌలు రైతులకు సంబంధించి రైతు భరోసా మార్గదర్శకాలపై గ్రామ సచివాలయ ఉద్యోగికి, వాలంటీర్లకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్న సీఎం-దానికి సంబంధించిన పత్రాలపై వారికి అవగాహన కల్పించాలన్న సీఎం
• దరఖాస్తు పత్రాలు, ప్రొఫార్మాలు అన్నీకూడా అక్టోబరు 2 నాటికి అందుబాటులో ఉంచాలన్న సీఎం
• లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తిచేయాలని సీఎం ఆదేశం 

Just In...