Published On: Thu, Sep 10th, 2020

ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ధృవపత్రాల పరిశీలన

* సమగ్ర శిక్షా పధక సంచాలకులు వెట్రిసెల్వి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడుచున్న171 ఇంటర్మీడియట్ కస్తుర్భా గాంధీ బాలికా విద్యాలయాలలో (కేజీబీవీలలో) 2020 -21 విద్యా సంవత్సరానికిగాను, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు దరఖాస్తులను స్వీకరించుట ఆగస్టు నెల 25తో ముగిసింది. మొదటి విడతలో ఎంపిక చేయబడిన విద్యార్ధినుల జాబితా సంబంధిత కేజీబీవీలకు పంపించిన‌ట్లు సమగ్ర శిక్షా పధక సంచాలకులు వెట్రిసెల్వి  తెలిపారు. సదరు విద్యార్థినులు సెప్టెంబరు 11వ తేది నుండి సెప్టెంబరు 18వ తేదీ లోగా , వారి మొబైల్ నెంబర్ కు పంపబడిన సమాచారము ప్రకారము సంబంధిత కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయవలసిందిగా తెలియపరచడమైనది. మొబైల్ ఫోన్  ద్వారా సమాచారం అందించ బడిన విద్యార్ధినులు, తమతో ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్,  ఎస్‌.ఎస్‌.స‌సి పాస్ షార్ట్ మెమో మొదలగు వివరములను తమతో తీసుకుని వెళ్లాల‌ని తెలిపారు.  విద్యార్థినులు తాము  చదివిన కేజీబీవీ లో సీటు వచ్చినట్లయితే పైన చెప్పబడిన ధృవపత్రాలు సంబంధిత పాఠశాల నందు ఉండును. ఎంపిక చేయబడిన విద్యార్ధినుల  వివరములను వెబ్ సైట్ నందు మరియూ పాఠశాల నోటీసు బోర్డు నందు ప్రదర్శించబడతాయి. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 9441270099, 9494383617 సంప్ర‌దించాల‌ని కోరారు.

Just In...