Published On: Fri, Feb 8th, 2019

ఇంటీరియల్ డిజైనింగ్‌కు చిరునామా ‘ఉషాస్మార్ట్ హెూమ్స్’

* రీసెర్చ్ మీడియా గ్రూప్, ఉషా స్మార్ట్ హోమ్స్ పరస్పర వ్యాపార భాగస్వామ్య ఒప్పందం 

* ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జ్యోతిమిర్కెచే కంపెని లోగో ఆవిష్కారం

* కార్పోరేట్ కంపనీలకు అద్భుతమైన డిజైన్లు 

సెల్ఐటి న్యూస్‌, విశాఖ‌ప‌ట్నం: ఇంటీరియల్ డిజైన్స్, విజవల్ కాన్సెప్ట్‌తో ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో  అద్భుతంగా రాణిస్తోంది ఉషా స్మార్ట్ హెూమ్స్.. అందానికి ఆధునికత అద్ది, ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్, ఇంటీరియల్‌ డిజైనింగ్, విజవల్ కాన్సెప్ట్ తదితర రంగాలలో అనుభ‌వం గడించిన నిపుణులచే విశేష అనుభవాన్ని జోడించి వందలాది గృహాలు, బహుళ అంతస్తుల భవనాలు, కార్పోరేట్ ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థలు, కార్పోరేట్ హాస్పిటల్స్, సాఫ్ట్ వేర్ కంపెనీలు, మాకి అంతర్గత సొగసులు అందించటంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఇంటీరియల్ డిజైనింగ్ సంస్థ ఉషా స్మార్ట్ హెూమ్స్…
అందం, ఆధునిక, అలంకరణకి అధిక ప్రాధాన్యతనిస్తున్న ఈ రోజుల్లో క్లయింట్స్ మనసుకి నచ్చిన రీతిలో, వారి అభీష్టానికి, అభిరుచికి అనుగుణంగా భవనాలకు ఇంటీరియల్ డిజైన్స్ చేస్తూ ఎందరో ప్రశంసలకు ఉషా స్మార్ట్ హెూమ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యం.చిరంజీవి అన్నారు. ఇటీవల కాలంలో అంతర్గత సొగసుల పట్ల ప్రజలలో అవగాహన, ఆసక్తి పెరిగిందని, తమ భవనాలను, వ్యాపార సంస్థలను అందంగా అలంకరించుకోవడం ప్రపంచ వ్యాప్తంగా ఓ ఫ్యాషన్ అయిందని గురువారం నాడు విశాఖపట్నం హెూటల్ మేఘాలయాలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ ఉషా స్మార్ట్ హోమ్స్ 2 దశాబ్దాలకు పైగా ఘన ప్రస్థానం గల రీసెర్చ్ మీడియా సంస్థలతో పరస్పర వ్యాపార సహకార భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. వేయి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఎంత గొప్ప విజయానికైనా ఒక చిన్న ఆలోచనే ప్రాతిపదిక అవుతుందన్న సూక్తికి రీసెర్చ్ మీడియా ప్రగతి ప్రస్థానం అద్దం పడుతుంది. ఒక చిన్న ప్రకటనల సంస్థగా మొదలైన రీసెర్చ్ మీడియా అంచెలంచెలుగా ఎదిగింది. సృజనాత్మకతను, నవ్యతను, నిబద్దతను, జవాబుదారి తనాన్ని మార్గదర్శక సూత్రాలుగా ఎంచుకొంది. జీవితంలో వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా ఎదగడం అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సహజంగా అయితే రెండోది ప్రయత్నపూర్వకంగా జరిగేది. ప్రయత్నం అంటే గెలుపో ఓటమో కాదు… అది ఒక అనుభవం. ఆ అనుభవాన్ని ఒంట పట్టించుకున్న రీసెర్చ్ మీడియా బహుముఖాలుగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. రీసెర్చ్ మీడియా అద్వర్టయిజింగ్, సెలబ్రిటీ హబ్, రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్ మెంట్, న్యూవేవ్ అడ్వర్టైజింగ్, మ్యాజిక్ మంత్ర, పింక్ పి. ఆర్ లైన్స్, కీహైట్స్, అప్డేట్స్ మరియు రిప్లెక్షన్స్ గా వైవిధ్యం చెందాయి. తెలుగు రాష్ట్రాలలోనే గాక అంతర్జాతీయంగా సేవలు అందిస్తోందని, ఎందరికో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని, ఉషా స్మార్ట్ హెూమ్స్‌తో పరస్పర ప్రయోజనకరమైన వ్యాపార ఒప్పందం ప్రాతిపదికగా రీసెర్చ్ మీడియా గ్రూప్ తన సేవలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్, ఇంటీరియర్ డిజైనింగ్ రంగాలకు అందిస్తుందని రీసెర్చ్ మీడియా గ్రూప్ సి. ఈ.ఒ. సిహెచ్.హరి లీలప్రసాద్ అన్నారు. అందరి ఆలోచనలను సరైన దిశలో పయనింప చేస్తూ, ప్రణాళికా బద్దంగా ప్రయత్నిస్తూ, నిలవాలన్నదే తమ సంకల్పమని అది మా విజయానికి మార్గదర్శక సూత్రం కావాలని రీసెర్చ్ మీడియా గ్రూప్ ఛైర్మన్ జె. చైతన్య చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బాలీవుడ్ హీరోయిన్ “జ్యోతి మీర్కె ఉషా స్మార్ట్ హెూమ్స్ లోగోను ఆవిష్కరించి కార్యక్రమములో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జ్యోతిమిర్కె మాట్లాడుతూ నేడు అమరావతి బాగా అభివృద్ది చెందుతుందని, ఎన్నో ఆధునిక కట్టడాలు ఇక్కడ వస్తున్నాయని, ఇటువంటి తరుణంలో ఉషా స్మార్ట్ హెూమ్స్ లాంటి కంపెనీల అవసరం ఎంతైనా ఉందని నిర్వాహకులను ప్రశంసిచారు. ముగింపు కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ బి.పి.రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రముఖ కంపెనీలతో యంవోయులు కుదుర్చుకున్నామని తద్వారా వినియోగదారులకు నేరుగా కంపెనీ రేట్లకే ఇంటీరియర్ సామాగ్రి అందజేయటం తమ కంపెనీ ప్రత్యేకత అని పేర్కొన్నారు. విశాఖపట్నం బిజేపి నగరపార్టీ కార్యదర్శి దామోదర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Just In...