Published On: Wed, May 16th, 2018

ఇంద్ర‌కీలాద్రిపై అన్న‌దాన ఏర్పాట్ల‌పై ప‌రిశీల‌న‌

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రమైన ఇంద్ర‌కీలాద్రిపై మ‌హామండ‌పంలో ఏర్పాటు చేసిన నిత్య అన్న‌దాన ప‌థ‌కానికి సంబంధించిన ఏర్పాట్ల‌ను ఆల‌య పాల‌క‌మండ‌లి ఛైర్మ‌న్ య‌ల‌మంచ‌లి గౌరంగ‌బాబు మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అన్న ప్ర‌సాదాన్ని స్వీక‌రించిన భ‌క్తుల‌తో ముచ్చ‌టించారు. అన్న‌దాన ఏర్పాట్ల‌పై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశారు. కార్య‌క్ర‌మంలో ధర్మకర్తల మండలి సభ్యులు  బడేటి ధర్మారావు, అన్నదానం నందు పనిచేయు ఆలయ అధికార్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...