Published On: Fri, Feb 8th, 2019

ఇంద్ర‌కీలాద్రిపై నూత‌న ఆర్జిత సేవ‌గా రాహు కేతు పూజ‌

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానంలో శ‌నివారం నుండి ప్రతి రోజు రాహు కాలంలో నూతన ఆర్జిత సేవగా రాహు కేతు పూజను అధికారికంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆల‌య ఈవో వి.కోటేశ్వ‌ర‌మ్మ తెలిపారు. దేవ‌స్థానంలోని న‌ట‌రాజ ఆల‌యం ప‌క్క‌న ఉన్న ఖాళీస్థ‌లంలో మూడు రోజుల పాటు ట్ర‌య‌ల్‌ర‌న్ నిర్వ‌హించిగా రాహు కేతు పూజ‌కు భ‌క్తుల నుంచి విశేష స్పంద‌న ల‌భించ‌డంతో పాటు విజ‌య‌వంతం కావ‌డంతో రాహు కేతు పూజ‌ను ఆర్జిత సేవ‌గా ఈవో ప్ర‌క‌టించారు. టిక్కెట్లు ఇక‌పై ఆన్‌లైన్‌లో www.kanakadurgamma.org నందు, మీ సేవ సెంట‌ర్లు, దేవస్ధాన ఆర్జిత సేవ కౌంటర్ల‌లో ఒక రోజుకు 23 టిక్కెట్లు చొప్పున భక్తులకు అందుబాటులో ఉంటాయ‌న్నారు. ఉభ‌య‌రుసుము మనిషి ఒక్కరికి రూ.1,116లుగా నిర్ణ‌యించారు. ఇరువురికి పూజ ప్రవేశం క‌ల్పించారు. ఇరువురికి ముఖ మండపం ద్వారా దర్శనమునకు అనుమతి (ప్రతి రోజు రాహు కాలములో జరుగును). శుక్ర‌వారం నిర్వ‌హించిన ట్రయిల్ రన్ పూజ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాదికారి వి.కోటేశ్వరమ్మ సమక్షంలో భక్తులు, మీడియా సిబ్బంది పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చక సిబ్బంది, వైదిక కమీటి ఆధర్వంలో పూజా కార్యక్రమము ఘనంగా నిర్వహించారు.
 

Just In...