Published On: Mon, Apr 15th, 2019

ఇంద్ర‌కీలాద్రిపై వైభ‌వంగా ప్రారంభ‌మైన చైత్ర మాస బ్ర‌హ్మోత్స‌వాలు

* ప‌సుపు కొట్టి శ్రీకారం చుట్టిన ముత్తైదువులు

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన ఇంద్ర‌కీలాద్రిపై సోమ‌వారం ఉద‌యం గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు మంగళ స్నానాలు, వధూవరులుగా అలంకరించుటకు ముందుగా మొట్ట మొదటి సారిగా ఆలయంలో ప‌సుపు కొట్టే కార్య‌క్ర‌మంతో  చైత్ర మాస బ్ర‌హ్మోత్స‌వాలు వైభవంగా నిర్వహించుటకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంత‌త‌రం గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు మంగళ స్నానాలు, వధూవరులుగా అలంకరించుట, విఘ్నేశ్వర పూజ, అగ్ని ప్రతిష్టపాన, అఖండ దీప స్ధాపన , కలశారాధన, బలిహరణ వంటి కార్య‌క్ర‌మాల‌ను ఆల‌య వేద‌పండిఉలు శాస్తోక్త‌కంగా నిర్వ‌హించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వై.మల్లయ్య శాస్త్రి,  ఆలయ కార్యనిర్వహణాదికారి వి.కోటేశ్వరమ్మ పాల్గ‌గొని గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్య‌క్ర‌మంలో ధర్మకర్తల మండలి సభ్యులు సి.హెచ్.సాంబ సుశీలాదేవి, భక్తులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ప్ర‌త్యేక పూజ కార్యక్రమాలు అర్చక సిబ్బంది, స్ధానాచార్య వి.శివప్రసాద్ శ‌ర్మ‌, వైదిక కమిటీ స‌భ్యుల ఆధ్యర్వంలో పూజ వైభ‌వంగ‌గా నిర్వహించారు. ప‌సుపు కొట్టి చైత్ర మాస బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌హిళ‌ల‌కు ఆల‌య ఈవో కోటేశ్వ‌ర‌మ్మ పండ్లు, వ‌స్తాలు అంద‌జేశారు.
 

Just In...